Pushpa 2 : వామ్మో.. 'పుష్ప 2' ను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారా?

అల్లు అర్జున్ 'పుష్ప2' సినిమాను ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోనూ రిలీజ్ చేయనున్నారట. తాజాగా నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటూ స్పానిష్, జాపనీస్, రష్యన్, చైనీస్ భాషల్లోనూ రిలీజ్ చేస్తామని అన్నారు.

New Update
tgh

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప 2'. పార్ట్-1 కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. డిసెంబర్ 6 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. 

వీలైనన్ని భాషల్లో..

కానీ నేడు ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమాను ఒక్కరోజు ముందే తీసుకొస్తున్నామని వెల్లడించారు. అలాగే సినిమాకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఓ విలేకరి..' పుష్ప 2' ను పాన్ ఇండియాతో పాటూ ఇతర భాషల్లో రిలీజ్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా?' అని అడగ్గా.. నిర్మాత బదులిస్తూ..' 'పుష్ప 2' ను వీలైనన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం.

Also Read : జానీ మాస్టర్ కు బెయిలొచ్చింది, 'పుష్ప2' షూట్ లో జాయిన్ అవుతారా?

 దానికి సంబంధించి మేము కొన్ని ప్లాన్స్ కూడా చేస్తున్నాం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటూ స్పానిష్, జాపనీస్, రష్యన్, చైనీస్.. ఇలా వీలైనన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తాం. కాకపోతే ముందు పాన్ ఇండియా రిలీజ్ అయిన.. 2,3 నెలలకు ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం.." అంటూ తెలిపారు. దీంతో నిర్మాత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

రిలీజ్ కు ముందే వెయ్యి కోట్లు..

ఈ కామెంట్స్ తో 'పుష్ప 2' విదేశాల్లోనూ అదరగొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కేలవం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టినట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.660 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.   డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.425 కోట్లకు డీల్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు