పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి

పుష్ప2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరగడంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈమె కుమారుడు, కూతురు పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి ఈ విషాదం చోటుచేసుకుంది.

New Update

ప్రపంచ వ్యాప్తంగా నేడు పుష్ప-2 సినిమా విడుదలైంది. నిన్నటి నుంచే బెనిఫిట్స్ షోలు ప్రారంభమయ్యాయి. అయితే నిన్న రాత్రి ప్రీమియర్ షో నిర్వహించడంతో.. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌‌కు చెందిన రేవతి అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

ఇది కూడా చూడండి: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

ఇద్దరి పరిస్థితి విషమం..

ఆమె కుమారుడు తేజ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ప్రీమియర్ షో కోసం సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ ఫ్యామిలీ రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులు సీపీఆర్ అందించిన ఫలితం లేకపోయింది. తల్లి మృతి చెందగా.. కొడుకు, కూతురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 

ఇది కూడా చూడండి: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గరకు బన్నీ కుటుంబ సభ్యులతో చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా అక్కడకి తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది. ఏం చేయాలో తెలియక జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

ఇది కూడా చూడండి: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు