'పుష్ప 2' సినిమాలో 'గంగమ్మ తల్లి' జాతర స్టోరీ ఏంటో తెలుసా..?

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అంతే కాదు సినిమాలో ఈ ఒక్క సీక్వెన్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారట. 'గంగమ్మ తల్లి' జాతర స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి పూర్తి ఆర్టికల్ చదవండి.

author-image
By Archana
New Update
allu arjun

Pushpa 2

Pushpa 2:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా 'గంగమ్మ తల్లి' జాతర సీక్వెన్స్  సినిమాకే హైలైట్ గా నిలిచింది. దీని కోసమే మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలనిపించేలా చిత్రీకరించారు.  అయితే ఈ సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అంతే కాదు సినిమాలో ఈ ఒక్క సీక్వెన్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారట మేకర్స్. 

Pushpa 2 The Rule Music Rights

'గంగమ్మ జాతర' స్టోరీ

జానపద కథలు, పురాణాల ప్రకారం..  గంగమ్మను  తిరుపతి నగరంలోని శ్రీ తాతయ్యగుంట గ్రామదేవిగా చెబుతారు. చాలా కథలలో ఆమె వేంకటేశ్వర స్వామికి సోదరి అని కూడా చెప్పబడింది.  

కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుపతి వాటి పరిసర ప్రాంతాలను పాలగొందులు పరిపాలించినప్పుడు మహిళలపై అకృత్యాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఆ పాలెగొందులు మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, ప్రాణాంతక దాడులకు పాల్పడ్డారట.  అయితే ఆ సమయంలో  గంగమ్మ దేవత అవిలాల అనే గ్రామంలో జన్మించిందట. కాగా, వయసు పెరిగేకొద్దీ ఆమె చాలా అందమైన మహిళగా తయారైంది.  అప్పుడు పాలగొందులు గంగమ్మ దేవికి హాని కలిగించడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె తన శక్తులతో దాడులను ఎదుర్కున్నారట. 

దీంతో  ఆ పాలెగొందులు  పారిపోయి దాక్కున్నారని అంటారు. వాళ్ళను తరిమి కొట్టేందుకు గంగమ్మ తల్లి  'గంగా జాతర' రూపంలో వారం రోజుల పాటు వింత వేషధారణలు తిరుగుతూ ఏడో రోజు పాలెగొందులు బయటకు రాగానే వారిని హత్య చేసిందట. ఈ సంఘటనను స్మరించుకుంటూ, గంగమ్మ దేవి పట్ల భక్తిని చాటుకోవడానికి ఈ పండుగను నేటికీ జరుపుకుంటారు అక్కడి వాసులు. ఇదే విధంగా అల్లు అర్జున్ 'పుష్ప2' లో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్ లో రౌడీలను పెట్టుకున్నారట. 

ఈ పండుగలో పురుషులు స్త్రీల వేషం వేస్తారు. వారిలాగే చీరలు, మేకప్, నగలు, విగ్గులు కూడా ధరిస్తారు. ఈ విధంగా వారు గంగమ్మ దేవి ,స్త్రీ పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేస్తారు. ఎన్నో నియమాలున్న ఈ జాతరలో ఏడు రోజులపాటు వివిధ రకాల వేషధారణలతో జనం కనిపిస్తారు.  'పుష్ప 2' టీజర్ లో అల్లు అర్జున్ కనిపించే గెటప్ జాతర ఐదవ రోజున వేసే 'మాతంగి వేషం' అని నివేదికలు సూచిస్తున్నాయి.

publive-image

6 నిమిషాల సీక్వెన్స్ కోసం 60 కోట్లు

టీజర్ లో అల్లు అర్జున్ బాడీ మొత్తం డార్క్ బ్లూ పెయింట్ వేసుకొని, చీర, నగలు ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే పుష్ప2 మూవీలో ఈ ఒక్క జాతర సీక్వెన్స్ షూట్ చేయడానికి భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారంట మేకర్స్. సినిమాలో కేవలం 6 నిమిషాల నిడివి గల ఈ జాతర సీక్వెన్స్ దాదాపు 30 రోజులు షూట్ చేశారని. ఈ ఒక్క సీక్వెన్స్‌ కోసం 60 కోట్లు ఖర్చు  చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Jr NTR: ఎన్టీఆర్ వార్ మొదలెట్టేశాడు..10 రోజులు అక్కడే!

#allu-arjun-pushpa-2
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు