Pushpa 2: ‘పుష్ప’ కన్నడ వివాదం..అసలు కారణం ఇదేనా!

“పుష్ప 2” సినిమా మిడ్ నైట్ షోలను రద్దు చేయాలని బెంగళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలివ్వడం ప్రస్తుతం వివాదస్పదం అవుతుంది.అసలు సినిమాని ఎందుకు ఆపేయాలనుకుంటున్నారో ఈస్టోరీలో ..

New Update
allu arjun

Pushpa 2: “పుష్ప 2” సినిమా మిడ్ నైట్ షోలను రద్దు చేయాలని బెంగళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలివ్వడం ప్రస్తుతం వివాదస్పదం అవుతుంది. పుష్ప 2 సినిమాని పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక పుట్టిన గడ్డ అయినటువంటి కన్నడ రాజ్యాన ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

Also Read: BIT Coin: 1,00,000 డాలర్లకు బిట్‌ కాయిన్‌ !

దీనికి కారణం లేకపోలేదు. అవి ఏంటంటే..బెంగుళూరులో కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి పూట షో వేయడంతో పాటు, టిక్కెట్ల ధరలు కూడా అని తెలుస్తుంది. ముందుగా చంద్రాదయ, రాజాజీనగర్‌లోని నవరంగ్‌, తావరేకెరెలోని బాలాజీ, కత్తారిగుప్పెలోని కామాక్య, మగాడిరోడ్డులోని ప్రసన్న, ఫెలిసిటీ మాల్‌లోని, సినీఫైల్ వంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకు షో మొదలవుతుందని ప్రకటించారు.

Also Read: ''నాన్న నువ్వే నా హీరో''.. పుష్ప2 రిలీజ్ వేళ అయాన్ స్పెషల్ లెటర్ వైరల్!

పైగా బుక్ మై షో లో దీనికి సంబంధించిన బుకింగ్ కూడా మొదలైంది. కానీ ఈ విషయంపై భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. కన్నడ సినీ నిర్మాత సంఘం ఏకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.  ఫిల్మ్ ఎగ్జిబిషన్ నిబంధనల ప్రకారం కర్ణాటక థియేటర్లలో ఉదయం 6 గంటలలోపు ఏ థియేటర్‌లోనూ సినిమాలను వేయకూడదు.. ఒకవేళ ఈ రూల్స్‌ ని అతిక్రమిస్తే మాత్రం ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు థియేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Also Read: 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

 తాజాగా ‘పుష్ప 2’ తెల్లవారుజామున షోల విషయంలో కలెక్టర్ స్పందిస్తూ.. కర్ణాటక సినిమా నియంత్రణ చట్టంలోని రూల్ 41 ప్రకారం, డిసెంబర్ 5న నిర్ణయించిన సమయానికంటే ముందుగా సినిమాను ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

దీంతో కర్ణాటకలో అర్ధరాత్రి పడాల్సిన 100కు పైగా షోలు క్యాన్సిల్ కావడం, 6:30 తర్వాత షోలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మూవీ లవర్స్  ఇలా జరగడానికి గల కారణం కన్నడ స్టార్ హీరోలు అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!

నిజానికి ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాలను థియేటర్లలో ప్రదర్శించకూడదనే  రూల్ కర్ణాటకలో చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ రీసెంట్ గా విడుదలైన చాలా సినిమాలకు ఈ రూల్ ని అస్సలు పాటించలేదు. వాళ్లకైతే ఎలాంటి సమస్య ఉండదు కానీ, ఇప్పుడు ఆకస్మాత్తుగా ‘పుష్ప 2’ సినిమా  విడుదల విషయంలో మాత్రం ఈ రూల్ గుర్తుకు వచ్చింది. కావాలని సినిమాను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అంటూ అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కొంతమంది రీసెంట్ గా ‘భగీర’ అనే కన్నడ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకలేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా కన్నడలో అడ్డంకులు క్రియేట్ చేసి ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారని  అంటున్నారు. మరోవైపు అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. సినిమాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వెళ్లి ఫిర్యాదు చేశారు.దీంతో  షోలను రద్దు చేశారు. నిజానికి ఇది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల తప్పిదం. 

ఎందుకంటే ముందుగానే వాళ్ళు ఈ షోలకు అనుమతులు తీసుకొని ఉండొచ్చు. కానీ తీసుకోకుండా వేయడం వల్ల షోలు క్యాన్సిల్ చేసినట్లు వారు చెబుతున్నారు. ఇక కర్ణాటకలో సినిమాకు అడ్డంకులు ఏర్పడడానికి ఇది ఒక కారణమైతే… గతంలో జరిగిన రష్మిక వివాదం మరో కారణంగా అభిమానులు చెబుతున్నారు. ఒకానొక టైమ్ లో రష్మికను బ్యాన్ చేయాలి అంటూ కన్నడిగులు ఫైర్ అయిన తీవ్రంగా పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

 ‘కాంతారా’ సినిమా విడుదల సమయంలో ఆ మూవీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు రష్మిక సమాధానం ఇచ్చింది. కానీ త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన నిర్మాణ సంస్థ పేరును ప్ర‌స్తావించ‌డానికి ర‌ష్మిక ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో ఈ గొడ‌వ ప్రారంభమైంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు