/rtv/media/media_files/2026/05/05/allu-arjun-2026-05-05-10-23-54.jpg)
Allu Arjun
Allu Arjun: దక్షిణ భారత సినీ పరిశ్రమలో తమిళనాడు ఎప్పుడూ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. అక్కడ సినిమా, రాజకీయాలు ఒకదానితో ఒకటి బలంగా కలిసిపోయి ఉంటాయి. అందుకే టాప్ హీరో స్థానం అంటే కేవలం బాక్సాఫీస్ విజయాలు మాత్రమే కాదు, పెద్ద సామాజిక ప్రభావం కూడా కావాలి.
ఇప్పటి వరకు రజనీకాంత్ Rajinikanth, కమల్ హాసన్ Kamal Haasan వంటి దిగ్గజాలు ఆ స్థాయిని అందుకున్నారు. విజయ్ Vijay రాజకీయాల్లోకి వెళ్లడంతో, అజిత్ కుమార్ Ajith Kumar కూడా సినిమాల కంటే ఇతర పనులపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో, కోలీవుడ్‌లో కొత్త నంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ ఖాళీని ఇప్పుడు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
‘పుష్ప’ సినిమాతో తమిళనాడులో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో ఆయన క్రేజ్ బలంగా పెరిగింది.
ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం డబ్బింగ్ సినిమాలకే పరిమితం కాకుండా, నేరుగా తమిళ దర్శకులతో భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. అట్లీ Atlee దర్శకత్వంలో ‘రాకా’ అనే భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. అలాగే కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ఆయన సినిమా చేస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టులు కారణంగా అల్లు అర్జున్ ఇప్పుడు కోలీవుడ్‌లో కీలక స్థానం దక్కించుకునే దిశగా వెళ్తున్నారని భావిస్తున్నారు. విజయ్ వదిలిన స్థానాన్ని భర్తీ చేయడం సులువు కాకపోయినా, ఆయన చేస్తున్న ప్రాజెక్టులు, దర్శకుల ఎంపిక చూస్తే ఈ పోటీలో ఆయన బలంగా ఉన్నారని అంటున్నారు.
ఇక మరోవైపు, అల్లు అర్జున్ Allu Arjun అభిమాన సంఘాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో ఫ్యాన్స్ అసోసియేషన్ ముఖ్య సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అభిమాన సంఘాన్ని మరింత బలంగా విస్తరించడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై చర్చ జరిగింది. త్వరలోనే దక్షిణ భారతదేశ స్థాయిలో పెద్ద మీటింగ్ నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నారు. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తరించనుంది. మొత్తానికి అల్లు అర్జున్ క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బలంగా పెరుగుతోంది.
Follow Us