Allu Arjun: అనుమతి లేకుండా నా ఇమేజ్ వాడొద్దు.. పుష్ప రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్!

అల్లు అర్జున్ తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడకుండా ఆపాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI, డిజిటల్ మాధ్యమాల్లో పెరుగుతున్న దుర్వినియోగంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన బ్రాండ్ విలువను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నారు.

New Update
Allu Arjun

Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వాడకూడదని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో, ముఖ్యంగా AI టెక్నాలజీ వల్ల సెలబ్రిటీల ముఖాలు, వాయిస్‌లను మార్ఫింగ్ చేసి ప్రకటనల్లో ఉపయోగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనిపై అల్లు అర్జున్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కేసును జస్టిస్ తుషార్ రావు గెడెల ఇవాళ విచారించనున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి రక్షణ పొందారు. ఇప్పుడు అదే విధంగా తన హక్కులను కాపాడాలని అల్లు అర్జున్ కోరుతున్నారు. తనకు సంబంధం లేని వ్యాపారాల్లో తన పేరు వాడటం వల్ల తన బ్రాండ్ విలువ తగ్గుతుందని ఆయన చెప్పారు.

Also Read: మొన్న "జననాయగన్", నేడు "జైలర్ 2".. కోలీవుడ్ ను కుదిపేస్తున్న లీక్‌ల బెడ‌ద‌!

ప్రస్తుతం మార్కెట్‌లో తన ఫోటోలు ఉపయోగించి కొన్ని ఉత్పత్తులు అమ్ముతున్నారని, అలాగే తన డైలాగులు, వాయిస్‌ను కూడా అనుమతి లేకుండా ప్రకటనల్లో వాడుతున్నారని ఆయన అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా టీ-షర్టులు, ఇతర వస్తువులపై తన ఫోటోలు ముద్రించి విక్రయించడం జరుగుతోందని చెప్పారు. ఇవన్నీ తన ఇమేజ్‌పై ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: రామలక్ష్మణులు వలస కూలీలు.. ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ పిటిషన్ ద్వారా తన పేరు, వాయిస్, స్టైల్, మేనరిజంలపై పూర్తి హక్కు తనకే ఉండాలని ఆయన కోరుతున్నారు. భవిష్యత్తులో ఎవరు అనుమతి లేకుండా వాడకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.

Also Read: సుకేశ్‌కు షాకిచ్చిన జాక్వెలిన్.. రూ.215 కోట్ల కేసులో బిగ్ ట్విస్ట్!

ఇటీవలి కాలంలో పలువురు సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సినిమా రంగం నుండి మోహన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్, కాజోల్, మాధవన్, సల్మాన్ ఖాన్ వంటి వారు కూడా ఇలాంటి రక్షణ పొందారు. అలాగే రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల నుండి పవన్ కళ్యాణ్, అనిరుద్ధాచార్య, క్రీడా రంగం నుండి సునీల్ గవాస్కర్, సంగీత రంగం నుండి జుబిన్ నౌటియాల్ వంటి వారు కూడా తమ హక్కులను కాపాడుకున్నారు.

ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే దారిలో నడుస్తూ తన బ్రాండ్ విలువను కాపాడుకునేందుకు ఈ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు