Adivi Sesh Decoit Collections: ‘డెకాయిట్’ బాక్సాఫీస్‌ దూకుడు.. 8 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమా 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ దాటింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్‌లో దూసుకెళ్తోంది. ఎమోషన్స్, యాక్షన్ కలిసిన ఈ మూవీలో శేష్ నటన, కథపై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

New Update
Adivi Sesh Upcoming Movies

Adivi Sesh Decoit Collections

Adivi Sesh Decoit Collections: అడివి శేష్ నటించిన కొత్త చిత్రం డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద మంచి జోరుతో కొనసాగుతోంది. షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్, యాక్షన్ థ్రిల్లర్ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్‌ను దాటింది.

సినిమా విడుదలైన మొదటి వారం నుంచే మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండో వారం ప్రారంభమైనా కూడా థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ తగ్గలేదు. కేవలం 24 గంటల్లోనే సుమారు 20 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కొత్త సినిమాలు వచ్చినప్పటికీ డెకాయిట్ క్రేజ్ తగ్గలేదు. ఆదివారం రోజున మరింత ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది. అయితే థియేటర్‌కు ముందే డిజిటల్, శాటిలైట్ వంటి హక్కుల ద్వారా మంచి ఆదాయం వచ్చింది. ఇప్పుడు థియేటర్ రన్ కూడా బలంగా కొనసాగుతుండటంతో నిర్మాత సుప్రియ యార్లగడ్డకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

సక్సెస్ మీట్‌లో అడివి శేష్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక అభిమాని చెప్పిన మాటలు తనను చాలా ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు. ఆ అభిమాని తన జీవితంలో ఎదురైన కష్ట సమయంలో మేజర్ సినిమా ధైర్యం ఇచ్చిందని, తర్వాత డెకాయిట్ కూడా థియేటర్‌లో చూసానని చెప్పాడని శేష్ అన్నారు.

ఆ మాటలు విన్న తర్వాత తాను ఎందుకు సినిమాలు చేస్తున్నానో మళ్లీ గుర్తు చేసుకున్నానని శేష్ ఎమోషనల్ గా చెప్పారు. ఇంకా ఎక్కువ కష్టపడాలనే ప్రేరణ ఆ క్షణంలో కలిగిందని తెలిపారు.


డెకాయిట్ ఒక లవ్, యాక్షన్ కథ. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో శేష్ తన పాత ప్రేమ కథ చుట్టూ తిరిగే ప్రతీకారం, ఎమోషన్స్, ట్విస్ట్‌లతో కూడిన పాత్రలో కనిపించారు.

కథ

కథలో హరిదాస్ అనే వ్యక్తి 13 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తప్పించుకుని దుబాయ్ వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ తన జీవితాన్ని నాశనం చేసిన మాజీ ప్రేయసిపై ప్రతీకారం తీర్చుకోవాలని తిరిగి వస్తాడు. అయితే ఆమె జీవిత పరిస్థితులు చూసి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమె కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కథను మరింత ఎమోషనల్ గా మారుస్తాయి. వీరిని వెంబడించే పోలీస్ అధికారి పాత్ర కూడా కథలో కీలకం.

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లు మాత్రం బలంగా ఉన్నాయి. దాదాపు రూ.30 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్‌కు రూ.60 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటికే రూ.50 కోట్ల మార్క్ దాటడంతో మరో కొద్ది రోజుల్లో లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

ఈ సినిమాకు రామ్ చరణ్ సోషల్ మీడియాలో ప్రశంసలు తెలిపారు. అలాగే నటుడు నాని కూడా ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పారని శేష్ వెల్లడించారు. ఈ స్పందనలు తనకు మరింత ఉత్సాహం ఇచ్చాయని ఆయన అన్నారు.

మొత్తానికి డెకాయిట్ థియేటర్లలో బలమైన రన్ కొనసాగిస్తోంది. ఎమోషన్స్, యాక్షన్, లవ్ కలిసిన ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ 50 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇంకా మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు