/rtv/media/media_files/2026/03/25/monalisa-2026-03-25-19-35-08.jpg)
కుంభమేళాలో తన అందంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయిన మోనాలిసా, ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తన భర్త ఫర్మాన్‌తో కలిసి కేరళలోని కొచ్చిలో ప్రెస్ మీట్ పెట్టిన ఆమె, ఒక ప్రముఖ హిందీ సినిమా డైరెక్టర్‌పై అత్యంత దారుణమైన ఆరోపణలు చేశారు.
మైనర్ బాలికలతో అసభ్యంగా
సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి సదరు డైరెక్టర్ మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మోనాలిసా ఆరోపించారు. అతను చాలా అసహ్యకరమైన వ్యక్తి. అతని పేరు చెప్పడానికి కూడా నేను ఇష్టపడటం లేదు. అలాంటి డైరెక్టర్ సినిమాల్లో నటించాలని నాకు అస్సలు లేదంటూ హిందీలో ఘాటుగా విమర్శించారు. తన భర్తతో తన పెళ్లి ఇష్టం లేకనే ఆ డైరెక్టర్ ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతున్నాడని ఆమె పేర్కొన్నారు.
తమ వివాహం గురించి వస్తున్న వార్తలపై కూడా మోనాలిసా స్పందించారు. మేము హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో పెళ్లి చేసుకున్నాం. నా భర్త ముస్లిం కావడంతో కొందరు దీనికి 'లవ్ జిహాద్' అని రంగు పూస్తున్నారు. ఆ డైరెక్టర్ మమ్మల్ని విడదీయాలని చూస్తున్నాడు, నా భర్తను టెర్రరిస్ట్ అని ముద్ర వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విడదీయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని, ఫర్మాన్ లేకుండా తాను బతకలేనని ఆమె స్పష్టం చేశారు.
తమకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు తమ పోస్టర్లను తగులబెడుతున్నారని మోనాలిసా దంపతులు వాపోయారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో కేరళకు వచ్చి పెళ్లి చేసుకున్నామని, ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.
Follow Us