సమాజంలో జరిగే విషయాలన్నింటినీ సినిమాలతో ముడిపెట్టొద్దన్నారు నటి అనసూయ. సినిమా అంటేనే కేవలం ఒక కల్పిత కథ అని, అందులో ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించుకునే పూర్తి తెలివితేటలు మనకే ఉంటాయని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి ఉండాల్సిన బాధ్యత, క్రియేటివ్ ఫ్రీడమ్ గురించి ఆమె సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు.
అనసూయ తన పోస్టులో.. "ఒకప్పుడు వచ్చే కథల్లో మంచి నీతి ఉండేది. హీరో పాత్రలు చూస్తే స్ఫూర్తి కలిగేది, విలన్ పాత్రలు చూస్తే అలా మనం ఉండకూడదు అనిపించేది. కానీ, ఈ రోజుల్లో వచ్చే కథల్లో ఆ క్లారిటీ కనిపించడం లేదు. క్యారెక్టర్‌ను ఏదో గొప్పగా చూపించాలనే ఆరాటంలో దర్శకులు గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక కథను సినిమాగా తీస్తున్నారంటే.. దాని ప్రభావం జనంపై ఎలా ఉంటుందనే విషయంలో టెక్నికల్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు.. చివరికి చూసే ప్రేక్షకులు కూడా భాగస్వాములే. అందుకే సినిమా ఎప్పుడూ బాధ్యతగా ఉండాలి. క్రియేటివిటీ విషయంలో వచ్చిన గొడవల వల్లే నేను కొన్ని షోల నుంచి తప్పుకున్నాను కూడా. దానివల్ల నాకు మంచి అవకాశాలు రాక ఇబ్బందులు పడ్డాను. అంత కష్టంలోనూ నా నమ్మకాల కోసమే నేను నిలబడ్డాను" అని చెప్పారు.
సినిమాలు తీసేవారికి స్వేచ్ఛ ఎంత అవసరమో, సమాజం పట్ల బాధ్యత ఉండటం కూడా అంతే ముఖ్యమని అనసూయ అన్నారు. సినిమాలు సమాజాన్ని మార్చేయాలని మనం ఆశించలేమని, అలాగని సినిమాల ప్రభావం అస్సలు ఉండదు అని కూడా అనుకోలేమని చెప్పారు. సమాజంలో జరిగే ప్రతి తప్పుకు సినిమాను బ్లేమ్ చేయలేమన్నారు. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది ముందుకు వచ్చి సినిమాల్లోని పాత్రలను, కథలను ప్రశ్నించడం చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అవసరమైనప్పుడు తప్పులను ప్రశ్నించడం అంటే సినిమా స్వేచ్ఛను దెబ్బతీయడం కాదని, అది సమాజంలో అవగాహన పెంచడమేనని ఆమె వివరించారు.
వ్యవస్థలో మనమంతా భాగమే
తాను ఎవరినీ తప్పుబట్టడం లేదని, ఈ వ్యవస్థలో మనమంతా భాగమేనని గుర్తుచేయడమే తన ఉద్దేశమని అనసూయ స్పష్టం చేశారు. ఇకనైనా కథలు రాసేవారు, యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఆడియన్స్.. అందరూ బాధ్యతగా, సామాజిక స్పృహతో ఉంటారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Anasuya : ప్రతి తప్పుకీ సినిమానే అనకండి...అనసూయ సంచలన పోస్టు!
సమాజంలో జరిగే విషయాలన్నింటినీ సినిమాలతో ముడిపెట్టొద్దన్నారు నటి అనసూయ. సినిమా అంటేనే కేవలం ఒక కల్పిత కథ అని, అందులో ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించుకునే పూర్తి తెలివితేటలు మనకే ఉంటాయని తెలిపారు.
Anasuya