/rtv/media/media_files/KA4JlsqZKgmF6PU1Ygsu.jpg)
vijay thalapathy
Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy) ప్రస్తుతం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ మాజీ నాయకుడు గాంధీ నేపథ్యంలో సాగిన ఈ మూవీ తొలిరోజు నుంచే భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. ఈ మూవీలో తండ్రి కొడుకులుగా విజయ్ డ్యూయల్ రోల్ ఆకట్టుకుంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్, యోగి బాబు, ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read : వరుణా మళ్లీ వచ్చావా... బంగాళాఖాతంలో అల్పపీడనం
#దళపతి 69 విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్
థియేటర్స్ లో 'ది గోట్' (The GOAT) సక్సెస్ కొనసాగుతుండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు విజయ్. #దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రానికి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించనున్నారు. "దశాబ్దాలుగా మనల్ని అలరించిన వ్యక్తి ఎప్పటికీ నిలిచిపోయే వేడుకలను రూపొందించడానికి చివరి క్షణంలో అడుగుపెడుతున్నాడు" అంటూ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ మూవీని అనౌన్స్ చేశారు. ఈ విడియోను విజయ్ సినిమాటిక్ జర్నీతో డిజైన్ చేశారు. ఇది చూస్తుంటే విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఇదే ఆయన చివరి సినిమాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
The one who entertained us for decades is stepping in ONE LAST TIME to create celebrations that will last forever 💥💥
— BA Raju's Team (@baraju_SuperHit) September 13, 2024
The most awaited announcement is here…❤️#Thalapathy69 will be made under @KVNProductions ❤️🔥
Project details will be unveiled tomorrow at 5:00 PM 🔥🔥
▶️… pic.twitter.com/FCjYMrca3W
Bigg Boss Telugu : 'బిగ్ బాస్ -8' కు రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ..