/rtv/media/media_files/2026/04/20/26-years-of-puri-jagannadh-2026-04-20-19-02-12.jpg)
26 Years Of Puri Jagannadh
26 Years Of Puri Jagannadh: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ ప్రయాణం నేటితో 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “బద్రి” సినిమాతో ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా 2000 ఏప్రిల్ 20న విడుదలై పెద్ద హిట్‌గా నిలిచింది.
పూరీ తన ప్రత్యేకమైన స్టైల్‌తో హీరోలను కొత్తగా చూపించడం, పవర్ ఫుల్ డైలాగ్స్ రాయడం, హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ద్వారా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్ అప్పట్లో పెద్ద ట్రెండ్‌గా మారాయి. అందుకే చాలా మంది స్టార్ హీరోలు ఆయనతో పనిచేయాలని కోరుకుంటారు.
What a journey it has been for this Man 🙏🏻🙏🏻🙏🏻
— VijaySethupathi (@VijaySethuOffl) April 20, 2026
26 years in cinema is not just a milestone, it’s a legacy built with courage, conviction, and a fearless voice.
Dear Puri sir, it was an absolute pleasure working with you on #SLUMDOG – 33 Temple Road. As actors, we always look… pic.twitter.com/XJ9NM1fWv2
ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని అనేక మంది స్టార్ హీరోలతో పూరీ సినిమాలు చేశారు. వారి కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్ సినిమాలను కూడా అందించారు. ఆయన స్థాయి ఎంత గొప్పదో చెప్పడానికి, దర్శకధీరుడు రాజమౌళి కూడా ఒకప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి సిద్ధమయ్యారని చెప్పడం ఆయన ప్రతిభను చూపిస్తుంది.
ఇప్పుడు పూరీ జగన్నాథ్ 26 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో “#26YearsOfPuriJagannadh” అనే హ్యాష్‌ట్యాగ్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు.
ఇక ఆయన దర్శకత్వంలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా “స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్” అనే కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ సందర్భంలో విజయ్ సేతుపతి పూరీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ధైర్యం, సృజనాత్మకత, పని చేసే విధానం తనను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు.
సెట్స్‌లో పూరీ చూపించే ఎనర్జీ, నటుల్ని ప్రోత్సహించే విధానం చాలా ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా తమ అందరికీ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని కూడా తెలిపారు. పూరీ మరిన్ని మంచి సినిమాలు చేయాలని, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
మొత్తానికి, పూరీ జగన్నాథ్ 26 ఏళ్ల సినీ ప్రయాణం టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.
Follow Us