/rtv/media/media_files/2026/04/29/20-years-of-pokiri-2026-04-29-10-34-02.jpg)
20 Years of Pokiri
20 Years of Pokiri: టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన పోకిరి Pokiri సినిమా విడుదలై నేటికి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సినిమాతోనే హీరో మహేష్ బాబు Mahesh Babu ‘ప్రిన్స్’ నుంచి ‘సూపర్ స్టార్’గా మారిపోయారు. దర్శకుడు పూరి జగన్నాధ్ Puri Jagannadh తీసిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
2006 ఏప్రిల్ 28న విడుదలైన ‘పోకిరి’ మొదటి షోతోనే భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటికే వరుస పరాజయాలతో ఉన్న పూరీకి ఈ సినిమా పెద్ద కంబ్యాక్‌గా మారింది. మహేష్ బాబు కూడా దర్శకుడిపై నమ్మకం పెట్టుకుని ఈ సినిమాలో నటించారు. ఆ నమ్మకమే భారీ విజయానికి కారణమైంది.
Also Read: ట్రిపుల్ రోల్ లో ప్రభాస్! కల్కి 2 క్రేజీ అప్‌డేట్
ఈ సినిమాకు దాదాపు రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్ ముగిసే సరికి సుమారు రూ.39 కోట్ల షేర్ వసూలు చేసింది. రీ రిలీజ్ వసూళ్లతో కలిపి మొత్తం రూ.40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇది అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
‘పోకిరి’ మరో రికార్డు కూడా సృష్టించింది. 200 సెంటర్లలో 100 రోజులు, 63 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శితమైన ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. ఈ స్థాయి రన్ అప్పట్లో అరుదైన విషయం.
Also Read: సంచలనానికి 9 ఏళ్ల! ‘బాహుబలి 2’ సృష్టించిన చరిత్ర ఇదే!!
20 Years of Pokiri
Entiii Raa New Movie Trailer laa Inthaaa High istundiii🔥🔥🔥🔥🥵🥵#Pokiri Antey Industry Hit a Kaduu Epatiki Bore kottani Cinema kodaa 💥📈📈 Epudu chusina new Feels🤩#MaheshBabu#Varanasi#20YearsOfSouthIndustryHitPokiri
— 𝗠𝗯 𝗡𝗮𝘃𝗲𝗲𝗻 🖤 (@MBNaveen3) April 27, 2026
#20YearsForPokiri
pic.twitter.com/l4xQ0m5FmZ
ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా డి'క్రూజ్ Ileana D'Cruz నటించారు. ఈ సినిమా తర్వాత ఆమెకు కూడా పెద్ద అవకాశాలు వచ్చాయి.
ఇంత పెద్ద మైలురాయి అయినా, 20 సంవత్సరాల వేడుకకు పెద్దగా హంగామా లేకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు ఈ సినిమాను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ దర్శకుడు పూరీ, మహేష్ బాబు నుంచి పెద్ద రెస్పాన్స్ రాలేదు.
Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు కూడా దర్శకుడు S. S. రాజమౌళి S. S. Rajamouliతో భారీ సినిమా చేస్తున్నాడు.
అయితే ‘పోకిరి’ విడుదలైన తర్వాతే మహేష్ బాబు నిజమైన మాస్ స్టార్‌గా మారారని అందరూ భావిస్తారు. ఇప్పటికీ ఈ సినిమా టాలీవుడ్‌లో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.
Follow Us