సినిమాలకు బ్రేక్ ఇవ్వడంపై స్పందించిన నటి సమంత టాలీవుడ్ నటి సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. దీనిపై సమంత స్వయంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. సామ్ షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీ చూస్తే మాత్రం అది ముమ్మాటికి నిజమని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. By Shareef Pasha 10 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి టాలీవుడ్ స్టార్ నటి సమంత సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన నటి సామ్.. దాని చికిత్స కోసం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో ‘ఖుషీ’సినిమాతో పాటు, సిటాడెల్ వెబ్ సిరీస్ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తైన వెంటనే సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనిపై సామ్ స్వయంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సామ్ షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీ చూస్తే మాత్రం అది నిజమని తెలుస్తోంది. ఈ ఆరునెలలు చాలా కష్టతరంగా గడిచాయని సమంత తెలుపుతూ.. ఎట్టకేలకు ముగింపుకు వచ్చినట్లు చెప్పింది. కారవాన్ లైఫ్.. మరో మూడు రోజులు మాత్రమే అని పేర్కొంటూ సెల్ఫీ ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోలో సమంత చాలా బలహీనంగా, ముఖం అంతా పీక్కుపోయి కనిపిస్తోంది. సామ్ పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానులు ‘బీ స్ట్రాంగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్మూనిటీ డిసీజ్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘యశోద’ చిత్రం తర్వాత మయోసైటిస్ కారణంగా కాస్త బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే వరుణ్‌తో కలిసి సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో కంప్లీట్ చేసింది. అయితే మయోసైటిస్ నుంచి సామ్ ఇంకా పూర్తిగా కోలుకోలేని కారణంగా.. తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఇందులో భాగంగానే ఒక ఏడాది పాటు సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖుషీ, సిటాడెల్ తర్వాత సామ్ కు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సహా మరే ఇతర భాషలో కొత్త చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసే ఆలోచన లేదట.వాస్తవానికి ఖుషీ సినిమా తర్వాత తాను పని చేయాలనుకుంటున్న ప్రాజెక్టుల కోసం ముందుగా తీసుకున్న అడ్వాన్స్ ను కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిందని తెలుస్తోంది. డిసీజ్ నుంచి పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతురాలయిన తర్వాతే తానూ సినిమాల్లో నటించాలని సమంత ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి