Movie Tree : నేల కూలిన సినిమా చెట్టు... ఈ చెట్టు ఉంటే.. కచ్చితంగా హిట్టు! కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది.సుమారు 300 సినిమాల్లోని సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ డైరెక్టర్లు బాపు,విశ్వనాథ్, రాఘవేంద్రరావు వంటి వారు ఎన్నో సినిమాలను ఈ చెట్టుకింద తీర్చిదిద్దారు. By Bhavana 06 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Movie Tree Appeared In 300 Movies Fallen Down : కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి (West Godavari) ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది. గోదావరి ఒడ్డున ప్రకృతి అందాలకు చిరునామాగా నిలిచే నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయింది. సుమారు 300 సినిమాల్లోని ఎన్నో సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ డైరెక్టర్ బాపు, కే. విశ్వనాథ్, కే రాఘవేంద్రరావు వంటి వారు ఎన్నో సినిమాలను ఇక్కడి తీర్చిదిద్దారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి (Chiranjeevi), కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి ఎందరో అగ్రహీరోలంతా ఈ చెట్టుకింద సినిమాలను తీసినవారే. 1975లో వచ్చిన పాడిపంటలు సినిమాతో ఈ చెట్టు ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు వంటి అద్భుత సినిమాల్లోని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఎన్నో సినిమాలకు సూపర్ హిట్లు అందించిన ఈ సినీ చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద చూపించలేదు. ఏటా వరదలు (Floods) వచ్చినప్పుడల్లా గట్టు కొద్ది కొద్దిగా దిగబడి చివరికీ చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోయింది. Also read: గద్దర్ గళం మూగబోయి నేటికి ఏడాది..! #west-godavari #movies #movie-tree మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి