Chandrababu: ఫైబర్ గ్రిడ్ కేసులో దూకుడు పెంచిన సీఐడీ చంద్రబాబు మీదున్న ఫైబర్ గ్రిడ్ కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈరోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. By Manogna alamuru 02 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Chandrababu Fiber Grid Case: మధ్యంతర బెయిల్ వచ్చిన చంద్రబాబు విషయంలో సీఐడీ (AP CID) అస్సలు తగ్గేదే లేదంటోంది. ఫైబర్నెట్ కేసులో కొత్త యాక్షన్స్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగా చంద్రబాబు ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని ప్రతిపాదించింది. సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో (ACB Court) సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నాయి. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనుంది. ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇంతకు ముందే ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఎ -25 గా చంద్రబాబునాయుడు ఉన్నారు. Also Read: తెలంగాణ బీజేపీ నుంచి వివేక్ అవుట్..మరి మేనిఫెస్టో సంగతేంటి? తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారంలలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ చేయాలని సీఐడీ పటిషన్‌లో పేర్కొననుంది. అలాగే ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని నివాసాలను కూడా అటాచ్ చేయనుంది. మరోవైపు చంద్రబాబు నిన్న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. మరికాసేపట్లో జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళనున్నారు. నిన్న ఏఐజీ హాస్పటల్ వైద్యులు చంద్రబాబును కలిశారు. వారి సూచన మేరకు నేడు ఏఐజీకి చెకప్ కోసం బాబు వెళ్ళనున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వైద్య పరీక్షల నివేదికలను ఏసీబీ కోర్టుకు సమర్పించనున్నారు. #chandrababu #ap-cid #fiber-grid #fiber-grid-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి