Kerala Church Father: అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్‌..లైసెన్స్‌ కూడా వెనక్కి ఇచ్చేసి!

కేరళ(Kerala) లో ఓ చర్చి ఫాదర్ (church father)అయ్యప్ప స్వామి (ayyappa deeksha)దీక్ష తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో తన చర్చకు సంబంధించిన లైసెన్స్‌ ను కూడా తిరిగి చర్చ్‌ అధికారులకు అందజేశారు

New Update
Kerala Church Father: అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్‌..లైసెన్స్‌ కూడా వెనక్కి ఇచ్చేసి!

కేరళ(Kerala) లో ఓ చర్చి ఫాదర్ (church father)అయ్యప్ప స్వామి (ayyappa deeksha)దీక్ష తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో తన చర్చకు సంబంధించిన లైసెన్స్‌ ను కూడా తిరిగి చర్చ్‌ అధికారులకు అందజేశారు. ఆయన అయ్యప్ప దీక్షను ఎంతో నియమంగా, కఠినంగా చేయబోతున్నట్లు తెలిపారు. 41 రోజుల తరువాత ఆయన శబరిమల(sabarimala) వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు కూడా తెలిపారు.

తిరువనంతపురం(tiruvanthapur)లోని అంగ్లికాన్‌ చర్చ్‌(anglikan church) ఆఫ్‌ ఇండియా రెవరెండ్ మనోజ్‌ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. సెప్టెంబర్‌ 20 న శబరిమలకు వెళ్లనున్నట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలో ఆయన చర్చి లైసెన్స్‌ ని తిరిగి ఇవ్వడంతో విషయం తెలుసుకున్న చర్చ్‌ సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని మనోజ్‌ ను ఆదేశించారు.

దీనికి సంబంధించి మనోజ్‌ కూడా ధీటుగా స్పందించారు. ఆయన చర్చ్ అధికారులకు తెలియజేయకుండా ఐడీ కార్ట్, ప్రీస్ట్‌ హుడ్‌ తీసుకున్నప్పుడు ఇచ్చి రెవరెండం లైసెన్స్ వారికి అందజేశారు. అంతే కాకుండా ఆయన అంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సిద్ధాంతాలు, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అంగీకరించారు.

తను తీసుకున్న అయ్యప్ప స్వామి దీక్ష గురించి వస్తున్న విమర్శలను గురించి మనోజ్‌ ఫేస్‌ బుక్ లో ఓ వీడియో ద్వారా స్పందించారు. దానిలో ఆయన మనం ప్రేమించేది చర్చినా? లేక దేవుడినా? అనేది మీరందరూ నిర్ణయించుకోవచ్చని తెలిపారు. రెవరెండం తీసుకునన సమయంలో మనోజ్‌ సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌ గా చేస్తున్నారు.

తాజాగా మనోజ్‌ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నట్లుగా నల్లని దుస్తులతో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలు అయ్యాయి. దీని గురించి మనోజ్‌ మాట్లాడుతూ..నేను ఎలాంటి తప్పు చేయలేదు. హిందూ మతం మీద విశ్వాసంతో నేను స్వామి దీక్ష తీసుకున్నాను. హిందూ మతాన్ని ఆచారాలకు అతీతంగా అర్థం చేసుకోవడమే తన ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు