Thangalaan : 'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కోసం అన్ని నెలలు ఆగాల్సిందే? విక్రమ్ 'తంగలాన్' మూవీ ఆగస్టు 15న రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. కాగా ఈ మూవీ ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. డీల్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. By Anil Kumar 16 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Thangalaan Movie : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'తంగలాన్' ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపొందింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో విక్రమ్ నటన, ఆయన కనిపించిన తీరు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమ్ తన కెరీర్లో ఎన్నడూ చేయని విధమైన పాత్రలో కనిపించారు. దీంతో థియేటర్స్ లో ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే 'తంగలాన్' ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ్ తో పాటూ మొత్తం ఐదు భాషల ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. Also Read : సస్పెన్స్ కు తెర.. తలపతి విజయ్ లాస్ట్ సినిమాకు దర్శకుడు ఖరారు, ఎవరంటే? అయితే సినిమా రిలీజైన ఎనిమిది వారాలు అంటే సరిగ్గా రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన 'తంగలాన్' అక్టోబర్ సెకండ్ వీక్ లో ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్ పార్వతి తిరువోతు హీరోయిన్స్ గా నటించగా.. కలైరాణి, రంజిత్ జయకోడి వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. #thangalaan-ott-release #chiyaan-vikram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి