Thangalaan Movie : హిందీలో రిలీజ్ కు రెడీ అయిన 'తంగలాన్'.. ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ హిందీలో రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్టు 30న హిందీలో విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

New Update
Thangalaan Movie : హిందీలో రిలీజ్ కు రెడీ అయిన 'తంగలాన్'.. ఎప్పుడంటే?

Thangalaan Movie : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు హీరోయిన్స్ గా నటించారు.

సినిమాలో విక్రమ్ నటన, కథాంశం, దర్శకత్వం, సంగీతం ప్రేక్షకులను మెప్పించడంతో పాటూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అటు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. దీంతో ఈ చిత్రాన్ని హిందీ మార్కెట్‌లోనూ విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఈ మేరకు ఆగస్టు 30న హిందీలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇందులో భాగంగానే దర్శకుడు పా.రంజిత్‌ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టర్‌ పంచుకున్నారు. "బంగారు వీరుడు ఉత్తర భారత దేశానికి ఆగస్టు 30న వస్తున్నాడు. ఈ ఎపిక్‌ స్టోరీని చూసి ఆనందించేందుకు సిద్ధంగా ఉండండి" అంటూ క్యాప్షన్ పెట్టాడు. తమిళ్, తెలుగు భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న 'తంగలాన్' హిందీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు