Vikram : 'తంగలాన్' పార్ట్ - 2.. అదిరిపోయే అప్డేట్ షేర్ చేసిన విక్రమ్..!

'తంగలాన్’ మూవీ టీమ్ తాజాగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో విక్రమ్ 'తంగలాన్‌ 2' పై అప్డేట్ ఇచ్చారు.' దర్శకుడు పా. రంజిత్, నిర్మాతతో ఈ విషయంపై మాట్లాడుకున్నాం. పా. రంజిత్ కాస్త రిలాక్స్‌ అయ్యాక పార్ట్- 2 స్టార్ట్ చేస్తాం' అని అన్నారు.

New Update
Vikram : 'తంగలాన్' పార్ట్ - 2.. అదిరిపోయే అప్డేట్ షేర్ చేసిన విక్రమ్..!

Chiyaan Vikram : పా రంజిత్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పార్వతి తిరువొత్తు, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు. కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కలైరాణి, రంజిత్ జయకోడి వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు.

పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమాలో విక్రమ్ నటన, ఆయన కనిపించిన తీరు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీ రిలీజైన రెండు రోజుల్లోనే రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది.

Also Read : పూజా కార్యక్రమాలతో మొదలైన హను రాఘవపూడి – ప్రభాస్ మూవీ.. స్టైలిష్ లుక్ లో డార్లింగ్, పిక్స్ వైరల్

ఇందులో హీరో విక్రమ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజా సక్సెస్ మీట్ లో విక్రమ్ మాట్లాడుతూ.." తంగలాన్‌ అనేది ఒక మట్టి సినిమా. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని బలంగా నమ్మాను. ఇప్పుడు 'తంగలాన్‌ 2' కూడా తీసుకొస్తామం. దర్శకుడు పా. రంజిత్, నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో ఈ విషయంపై మాట్లాడుకున్నాం. పా రంజిత్ కాస్త రిలాక్స్‌ అయ్యాక అయ్యాక పార్-ట్ 2 స్టార్ట్ చేస్తాం" అని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు