AP Politics: చిత్తూరులో విచిత్రం... ఫ్లెక్సీల కోసం ఊరిని పంచుకున్న వైసీపీ నేతలు

మనం ఆస్తి పంపకాలను చూస్తుంటాం.. డబ్బును పంచుకోవడం చూసుంటాం... రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను చూసుంటాం.. కానీ ఫ్లెక్సీల కోసం ఊళ్లో వీదులు పంచుకోవడం ఎప్పుడైనా చూశారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు ఊరునే వైసీపీ నేతలు పంచుకున్నారు.

New Update
AP Politics: చిత్తూరులో విచిత్రం... ఫ్లెక్సీల కోసం ఊరిని పంచుకున్న వైసీపీ నేతలు

Chittoor : ఏపీ ప్రభుత్వం సామాజిక సాధికారిక బస్సు యాత్ర (Samajika Sadhikara Bus Yatra) పేరుతో ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అవ్వడానికి నాయకులు సంసిద్ధం అవ్వాలని అధిష్టానం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు సిటీకి సంబంధించి రేపు ( నవంబరు -2న ) నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి అధికార వైసీపీ నాయకులు (YCP Leaders) సంసిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం నిర్వహణలోనే ఆ పార్టీ నేతల్లోని అంతర్గత విభేదాలు వీధిన పడ్డాయి. ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను జిల్లాలో పెద్దమనిషిగా మంత్రిగా నాయకుల్ని తన కనుసన్నోళ్లు శాసించగల శక్తివంతమైన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీ ఈ బాధ్యతను అప్పచెప్పింది. కార్యక్రమం అంబరాన్ని అంటేలా ఉండాలని తలచిన మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) గడచిన వారం రోజులుగా జిల్లాలో నేతలతో చిత్తూరు సిటీలో సమావేశం ఇవ్వడంతో పాటు దిశా నిర్దేశం చేయడం ప్రారంభించారు. రేపే చిత్తూరు సిటీ మొదటి నగరంగా జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యేటువంటి ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్రకు సంబంధించి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ముఖ్య నాయకులు పాల్గొనాలని పెద్దిరెడ్డి ఆదేశించారు. ఇక్కడ వరకు బానే ఉన్నా.. రేపు కార్యక్రమం అనగా నగరంలో నాయకుల అంతర్గత విభేదాలకు అద్దం పట్టేలా ఫ్లెక్సీల ఏర్పాటు పంచాయతీ ప్రారంభమైంది.

చిత్తూరు సిటీలో శాసనసభ్యుడుగా ప్రాధాన్యత వహిస్తున్న ఆరని శ్రీనివాసులకు (Arani Srinivasulu), అదే నగరానికి చెందిన అధికార పార్టీకి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ విజయానందరెడ్డికి మొదటినుంచి విభేదాలు ఉన్న మాట నగరంలో అందరికీ తెలిసిన విషయమే. కనీసం పార్టీ కార్యక్రమాలలో అయినా తమ విభేదాలను బయటపెట్టి ప్రజల్లో చులకన కాకూడదని పెద్దిరెడ్డి ఎన్నిసార్లు సూచించిన లాభం లేకుండా పోయింది. ఇటు ఎమ్మెల్యే అనుచరులు అటు విజయానందరెడ్డి అనుచరులు తోపాటు మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ అనుచరులు, మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ తనయుడు భూపేష్ గోపినాథ్ అనుచరులు ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో విభేదాలు తలెత్తాయి. ఇదెక్కడ గొడవరా అనుకున్న మంత్రి, ఎమ్మెల్సీ తలసాని రఘురాంకు ఈ కార్యక్రమం ఏర్పాటులో ఎలాంటి విభేదాలు లేకుండా సజావుగా జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో.. రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ తలసాని చిత్తూరు నగరాన్ని నగరంలోని వీధులను ఎడమవైపు ఓ నాయకుడికి, కుడివైపు ఎమ్మెల్యేకు, వీధి మొదట్లో మరో ముఖ్య నేతకి, నడి ఒడ్డున మరో ప్రధాన నేతకి ఇలా స్థలాలను కేటాయించి ఫ్లెక్సీలు ఏర్పాటు కంటే మునుపే వారు వారి పేర్లతో ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసిన విధంగా చిన్ని పాటి నేమ్ ప్లేట్లు వేయడంతో చూసిన వారంతా ఇదేం కర్మ రా బాబు అని ముక్కున వేలేసుకొని ముందుకు సాగుతున్నారు. తమ ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం గురించి బస్సుయాత్ర చేస్తూ ప్రజల్లోకి మమేకం అవ్వడానికి తలపెట్టిన ఈ కార్యక్రమంలో నేతలు ఈ విధంగా ఎడమొహం పెడమొహం వేసుకుంటూ విభేదిస్తుంటే ప్రజల సేవ చేయడంలో ఏ మాత్రం ఉచ్చుఖత చూపుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: శాస్త్రవేత్తలకే అంతుచిక్కని నీళ్లు ఇచ్చే చెట్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు