Bhavyasri: భవ్యశ్రీ హత్య కేసు ఏమైంది..20 రోజులైన రాని క్లారిటీ..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన భవ్యశ్రీ హత్య కేసులో అసలు నిజాలు వెలుగులోకి రావడం లేదు. భవ్యశ్రీ చనిపోయి నేటికి 20 రోజులు గడుస్తున్న ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. భవ్యశ్రీది హత్యా లేక ఆత్మహత్య అనే కనీస వివరాలు సైతం పోలీసులు ఇవ్వని పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు బాధిత తల్లిదండ్రలు. భవ్యశ్రీ హత్య కేసుపై హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

New Update
Bhavyasri: భవ్యశ్రీ హత్య కేసు ఏమైంది..20 రోజులైన రాని క్లారిటీ..!

చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని  భవ్యశ్రీ అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. గత నెల 20 వ తేదిన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా ఓ బావిలో భవ్యశ్రీ మృతదేహం కనిపించింది.అమ్మాయి మృతదేహం ఉన్న స్థితిని చూసి.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయికి అరగుండు చేసి.. కనురెప్పలు కత్తిరించి.. బావిలో పడేసి ఉండటం సర్వత్రా సంచలనంగా మారింది.  భవ్యశ్రీని అత్యంత కిరాతకంగా చంపేసి గుర్తుపట్టుకుండా చేసి బావిలో పడేశారని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  మరోవైపు హత్య కాదు ఆత్మహత్యే అంటున్నారు పోలీసులు. మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని తెలిపారు.

అసలు భవ్యశ్రీ కేసులో ఏం జరిగింది? భవ్యశ్రీ చనిపోయి నేటికి 20 రోజులు గడుస్తున్న పోలీసులు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకున్నారు. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందా? అంటూ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భవ్యశ్రీ ది హత్యా లేక ఆత్మహత్య? భవ్యశ్రీ జుట్టు ఊడిందా? లేదంటే కట్ చేశారా? ఫోరెన్సిక్‌ రిపోర్ట్ లో ఏముంది? ఇప్పటి వరకు ఫోరెన్సిక్‌ రిపోర్ట్స్‌ పై పోలీస్ యంత్రాంగం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదంటూ పలు సంఘాలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నాయి.

Also Read: భద్రాద్రి జిల్లాలో మిస్టరీగా ప్రేమజంట ఆత్మహత్య ..డాక్టర్ మౌనిక ఫోన్‌లో ఏముంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు