సెల్‌ఫోన్‌ వాడొద్దన్నందుకు జలపాతంలోకి దూకిన యువతి, వీడియో వైరల్‌..

ఈకాలం యువత ఎలా తయారైందంటే... చిన్నచిన్న విషయాలకే ఎమోషనల్ అవుతూ తొందరపడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా.. ఓ అమ్మాయిని తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వాడొద్దు అన్నందుకు జలపాతంలోకి యువతి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఈ షాకింగ్‌ ఘటన చత్తీస్‌ఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

New Update
సెల్‌ఫోన్‌ వాడొద్దన్నందుకు జలపాతంలోకి దూకిన యువతి, వీడియో వైరల్‌..

సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్న ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు మందలించగా.. ఆ యువతి జలపాతంలోకి దూకింది. అదృష్టవశాత్తు ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరకు నీటిలో ఈదుకుంటూ సెల్ ఫోన్‌తో క్షేమంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ యువతిపై ఫైర్ అవుతున్నారు. ఏంటీ నీకు మెంటల్‌ హా.. అంటూ సీరియస్ అవుతున్నారు. నువ్వు చనిపోయి నీ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతావా అంటూ ఆ యువతిని మందలిస్తున్నారు.

తొందరపడుతున్న యువత..

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా... మనుషులు తినే ఆహారంలో మార్పులు, చుట్టూ ఉండే వాతావరణంలో మార్పుల మూలంగా వారివారి ఆలోచనలు మార్పులు సంభవిస్తున్నాయి. అలాగే ఈకాలం పిల్లల ఎదుగుదలలో మార్పులు, ఆలోచన శక్తిలో మార్పులు మనం చూస్తుంటాం. తల్లిదండ్రులు ఏదైనా కొనివ్వక పోయినా.. అడిగింది ఏదైనా ఇవ్వకపోయినా... చిన్నచిన్న ఘటనలకే గొడవలు పెట్టుకోవడం, అలగడం లాంటివి చేస్తుంటారు. దీనికి తోడూ వాతావరణ కాలుష్యం, నీటికాలుష్యం, మొత్తం పొల్యూషన్‌తో నిండిపోయింది. ప్రపంచం..

తొందరపడి ప్రాణాల మీదకు..

చిన్నచిన్న వాటికే యువత తొందరపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం లాంటివి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. దేశంలో ఏదో ఒక మూలన ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎగ్జామ్‌లో ఫెయిలయ్యానని కొందరు, ప్రేమలో ఫెయిలయ్యానని మరికొందరు.. బైక్ కొనివ్వలేదని.. అడిగింది ఇవ్వలేదని ఇలా రకరకాల కారణాలతో వారి నిండు జీవితాన్ని అర్ధాంతరంగా బలవన్మరణంతో మధ్యలోనే వారి జీవితానికి పుల్‌స్టాప్ పెడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు