Vishwambhara : మెగా ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'విశ్వంభర' టీజర్ లోడింగ్...! 'విశ్వంభర' టీజర్ పై అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న 'విశ్వంభర' టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. చిరంజీవి ఈ చిత్రంలో రెండు వేర్వేరు పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 21 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vishwambhara Teaser Update : 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రసుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే.. మెగాస్టార్ బర్త్ డే కు మూవీ టీమ్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న 'విశ్వంభర' టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇప్పటివరకు ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఆ దిశగానే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. Also Read : ప్రభాస్ ‘కల్కి’ పై అలనాటి స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వాళ్లకు బాగా నచ్చుతుందంటూ..! చిరంజీవి ఈ చిత్రంలో రెండు వేర్వేరు పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో ఆ పాత్రలను పరిచయం చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. #vishwambhara-teaser #megastar-chiranjeevi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి