Indra : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'ఇంద్ర' రీ రిలీజ్ వాయిదా? 'ఇంద్ర' మూవీ రీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. చిరు బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురైనట్లు సమాచారం. ఆగస్టు15న మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతుండటంతో 'ఇంద్ర' రీ రిలీజ్ ను పోస్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది. By Anil Kumar 14 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Indra Movie Re-Release : మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటైన 'ఇంద్ర' రీ రిలీజ్ కానున్నట్టు వైజయంతి మూవీస్ రీసెంట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో రీ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ రీ రిలీజ్ వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం థియేటర్ల సమస్య అని తెలుస్తోంది. ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్’ లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలకు అవసరమైన థియేటర్లను కేటాయించడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఈ సినిమాల రిలీజ్ తర్వాతే 'ఇంద్ర' కు ఎన్ని థియేటర్లు దొరుకుతాయో తెలుస్తుందని, అప్పుడు మాత్రమే రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. 22 glorious years of MEGA BLOCKBUSTER #Indra, a film that etched its mark on cinema and our hearts forever ❤️ In celebration of 50 GOLDEN YEARS OF VYJAYANTHI MOVIES, let’s relive the magic with a 𝐆𝐫𝐚𝐧𝐝 𝐑𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐨𝐧 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟐, in honour of Megastar… pic.twitter.com/jF3eSXrUX7 — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2024 Also Read : ఓటీటీలోకి ‘రాయన్’ ఎంట్రీ అప్పుడేనా? మరోవైపు ఈ సినిమాలు విడుదలైన వారం రోజులకే రీ రిలీజ్ ఉండడంతో ఇంద్ర ఎఫెక్ట్ ఈ సినిమాలపై ఉంటుందని, ముఖ్యంగా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. చిరు ఫ్యాన్స్ ఇంద్ర రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ వార్తతో ఫ్యాన్స్‌లో నిరాశ నెలకొంది. #megastar-chiranjeevi #indra-re-release మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి