Chiranjeevi: మెగా విరాళం..రెండు రాష్ట్రాలకు ఎంత ఇచ్చారంటే! ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు చిరు ప్రకటించారు. By Bhavana 04 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Chiranjeevi Announces One Crore Donation To AP - TG Floods : మెగాస్టార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కొంతకాలం క్రితం కేరళ (Kerala) లోని వయనాడ్ లో ప్రకృతి బీభత్సం సృష్టించినప్పుడు చరణ్, చిరు కలిసి కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains), వరదలు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి చిరంజీవి భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ (AP - Telangana)... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు చిరంజీవి (Chiranjeevi) కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు చిరు ప్రకటించారు. ''ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను'' అని చిరంజీవి ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో… — Chiranjeevi Konidela (@KChiruTweets) September 4, 2024 ''తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. 🙏'' అంటూ రాసుకొచ్చారు. Also Read: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి! #chiranjeevi #telangana-floods #vijayawada-floods #andhra-pradesh-floods #hyderabad-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి