TS: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై! బీఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ ఎంపీ టికెట్ తనకు కేటాయించకపోవడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. By srinivas 24 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CHINNAPAREDDY: బీఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ ఎంపీ టికెట్ తనకు కేటాయించకపోవడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు. బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా మొండిచేయి.. ఈ మేరకు నల్గొండ ఎంపీ టికెట్ సీనియర్ నేత కంచర్ల శ్రీనివాసరెడ్డి పేరును ప్రకటించడంతో తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను కేసీఆర్‌కు పంపించారు. ఇక 2019లో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన చిన్నపరెడ్డి మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ చిన్నపరెడ్డి.. ఈసారి కూడా తనకు మొండిచేయి చూపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరగుతోంది. #chinnapareddy #resign-to-brs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి