CHINA : బొగ్గు గని మరమ్మత్తులో ఏడుగురు మైనర్లు మృత్యువాత!

ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని తాయోవాన్ జిన్ లాంగ్ కోల్ ఇండస్ట్రీ లిమిటెడ్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో  ఏడుగురు మైనర్ల మృతదేహాలు లభించినట్టు కౌంటీ ప్రభుత్వం ప్రకటించింది.

New Update
CHINA : బొగ్గు గని మరమ్మత్తులో ఏడుగురు మైనర్లు మృత్యువాత!

Coal Mine : ఉత్తర చైనా(North China) లోని షాంగ్సీ ప్రావిన్స్‌(Shanxi Province) లోని తాయోవాన్ జిన్ లాంగ్ కోల్ ఇండస్ట్రీ లిమిటెడ్(Coal Industry Limited) లో సోమవారం జరిగిన ప్రమాదంలో  ఏడుగురు మైనర్ల మృతదేహాలు లభించినట్టు కౌంటీ ప్రభుత్వం ప్రకటించింది.

సోమవారం  గిడ్డంగి లోని బొగ్గు గోదాము(Coal Godown) ప్రమాదవశాత్తు కూలిపోయింది. గోదాములో పనిచేస్తున్న ఏడుగురు మైనర్లు బొగ్గు గనిలో చిక్కుకున్నారు. వెంటనే తాయోవాన్ జిన్ లాంగ్ కోల్ ఇండస్ట్రీ  పై  కౌంటీ ప్రభుత్వం గాలింపు చర్యలు  ప్రారంభించింది.  శుక్రవారం ఉదయం ఏడుగురు మైనర్ల మృతదేహాలు లభ్యమైయాయని కౌంటీ ప్రభుత్వం ప్రకటించింది. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా  బొగ్గును తొలగిస్తుండగా కింద ఉన్న నీటిపైపులు ధ్వంసం కావటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగించిందని  గావో నైచున్ అనే స్థానిక అధికారి తెలిపారు. చైనాలో, ఏడాది పొడవునా శక్తి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బొగ్గు గనులలో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. జనవరిలో, సెంట్రల్ చైనా(Central China) లోని హెనాన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో ప్రమాదంలో  10 మంది మరణించారు.గత అక్టోబర్‌లో ఉత్తర చైనాలోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో  11 మంది చనిపోయారు.

Also Read : మానవజాతిని అంతం చేసేది ప్రళయం కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఎలా అంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు