Hyderabad: హైదరాబాద్ పిల్లల అక్రమ రవాణా ముఠా.. చెప్పిన ముహూర్తానికి ఎత్తుకొస్తారట.. !! హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠాలోని 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, పుణెల నుంచి చిన్నారులను తీసుకొచ్చి పిల్లలు లేని వారికి రూ.5 లక్షల చొప్పున అమ్మకం చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లలో 60 మంది శిశువులను అమ్మినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 May 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad: ఈ మధ్య కాలంలో అంతర్ రాష్ట్ర ముఠా ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. పాలుతాగే పసికందులను కూడా వదలడం లేదు. పుట్టిన పది రోజుల్లోనే వారిని అపహరించి.. విమానాలు, రైళ్లలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పిల్లలు లేక మదనపడుతున్న దంపతులకు విక్రయిస్తున్నారు. అయితే, ఈ అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. రెండేళ్లలో 60 మంది.. ఢిల్లీ, పుణెల నుంచి చిన్నారులను తీసుకొచ్చి పిల్లలు లేని వారికి రూ.5 లక్షల చొప్పున హైదరాబాద్ లో అమ్మకం చేస్తున్న ముఠా ఆటకట్టించారు. హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్ అయింది. పిల్లల ముఠాలోని 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా రెండేళ్లలో 60 మంది శిశువులను అమ్మినట్లు అధికారులు వెల్లడించారు. Also Read: మొబైల్ ఫోన్ ఎక్కువగా చూస్తుందని మందలించిన తల్లి.. బాలిక ఏం చేసిందంటే? స్టింగ్ ఆపరేషన్.. ఇప్పటి వరకు ముఠా నుంచి కొన్న 16 మంది తల్లిదండ్రులను గుర్తించారు.16 మంది చిన్నారుల్ని స్వాధీనం చేసుకుని శిశువిహార్‌కు తరలించారు. 16 మందిలో 12 మంది ఆడపిల్లలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. స్టింగ్ ఆపరేషన్‌తో శిశువుల అమ్మకం బయటపడింది. అక్రమంగా చిన్నారుల్ని కొన్నవారిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం రాచకొండ సీపీ ఆఫీస్‌లో హైడ్రామా నడుస్తోంది. తమ పిల్లలను ఇవ్వాలంటూ పెంచిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా ఎలా పనిచేస్తుందంటే? ముందుగా వాట్సాప్, టెలిగ్రాం వంటి యాప్ లలో పిల్లల ఫొటోలను పిల్లలు లేని దంపతులకు పంపిస్తారు. పిల్లల రంగు, ముఖ పొలికలు బట్టి వారికి ఇష్టమైన వారిని ఎంపిక చేసుకుంటారట. ఫలానా ముహూర్తం లోపు పిల్లాడు కానీ, పాప కానీ కావాలని చెబితే చాలు.. ఆ సమయానికే పిల్లలను వారికి తీసుకొచ్చి అప్పగిస్తారట. రోజుల వయస్సు గల శిశువులనే దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో అయితేనే తనకు పుట్టిన బిడ్డగా.. పిల్లలకు కూడా వీరే సొంత తల్లిదండ్రులగా భావిస్తారని వారి ఆలోచన. ఇలా ప్రతి శిశువు అమ్మకంపై ఒక్క ఏజెంట్‌కు రూ.50 వేల నుంచి దాదాపు లక్ష వరకు లాభం పొందేవారు. #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి