Pak Woman : సరిహద్దులు దాటిన మానవత్వం... పాక్ యువతికి భారతీయుని గుండె! ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ పాకిస్తాన్ యువతికి భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆపరేషన్ ఐశ్వర్యన్ ట్రస్టు వారి సహకారంతో చెన్నై ఎంజీఎం హస్పిటల్ లో జరిగింది. By Bhavana 25 Apr 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Pakistan : ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ పాకిస్తాన్ యువతి(Pakistan Woman) కి భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆపరేషన్ ఐశ్వర్యన్ ట్రస్టు(Aishwaryan Trust) వారి సహకారంతో చెన్నై ఎంజీఎం హస్పిటల్(Chennai MGM Hospital) లో జరిగింది. పాక్ కు చెందిన అయేషా రషన్(Ayesha Rashan) (19) అనే యువతి గత కొంత కాలంగా గుండె సంబంధింత సమస్య(Heart Problem) తో బాధపడుతుంది. కొద్ది రోజుల నుంచి ఆమె పరిస్థితి మరింత దిగజారింది. వైద్యులు ఆమెను ఎక్మోపై ఉంచి చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. అయితే, హార్ట్ పంప్‌లోని వాల్వ్‌లో లీక్ ఏర్పడటంతో గుండె మార్పిడి ఆపరేషన్ తప్పనిసరైంది. అయితే.. ఆ ఆపరేషన్ కు సుమారు రూ. 35 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మొత్తాన్ని కూడా ఐశ్వర్యన్ ట్రస్టు, వైద్యులే సమకూర్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన గుండెను యువతికి అమర్చి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని అయేషా తెలిపింది. తన బిడ్డ ప్రాణాలను కాపాడిన ట్రస్టు, వైద్యులకు అయేషా తల్లి ధన్యవాదాలు తెలిపారు. సాధారణంగా అవయవదానానికి సంబంధించి విదేశీయులకు రెండో ప్రాధాన్యం ఉన్నా అయేషాకు మాత్రం సులభంగా గుండె లభించిందని ఇన్‌స్టిట్యూస్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ డైరెక్టర్ డా. బాలకృష్ణన్, కో డైరెక్టర్ డా. సురేశ్ రావు వివరించారు. అయేషా విషయంలో గుండె కోసం మరెవరూ క్లెయిమ్ చేసుకోలేదని తెలిపారు. అవయవదానం, ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్స్‌లో చెన్నై ముందున్న విషయం ఈ ఆపరేషన్‌తో మరోసారి స్పష్టమైందని వైద్యులు వ్యాఖ్యానించారు. Also read: నెత్తురోడిన తెలంగాణ.. సూర్యాపేటలో 6, వరంగల్ లో నలుగురు.. #pakistan #india #heart-transplantation #ayesha-rashan #chennai-mgm-hospital మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి