/rtv/media/media_files/2025/04/09/ducYkRlKbWCgD7jxqPMw.jpg)
Court Movie
Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్
ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Pawan Kalyan: పవన్ కి హరిరామజోగయ్య బహిరంగ లేఖ!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. రాబోయే కాలంలో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని లోకేష్ ప్రకటించారు..మీరు కూడా పలు సందర్బాల్లో తెలిపారు. మీరు మీకోసం వేచి చూస్తున్న జనసైనికులకు మీరేం చెప్పబోతున్నారంటూ ప్రశ్నించారు.
Hari Ramajogaiah: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి మాజీ మంత్రి , కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పవన్ కు (Pawan Kalyan) పలు ప్రశ్నలు సంధించారు. అందులో ఆయన '' చంద్రబాబే (Chandrababu) కాబోయే ముఖ్యమంత్రి ..ఈ నిర్ణయంలో రెండో మాట లేదు..అనుభవమున్న నాయకుని నాయకత్వమే రాష్ట్రానికి కావాలని పవన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు.
కాబట్టి అదే అందరి మాట అంటూ లోకేష్ బాబు (Nara Lokesh) ప్రకటించేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. లోకేష్ బాబు ఆశిస్తున్నట్లు చంద్రబాబునే పూర్తి కాలం ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారా? దానికి మీ ఆమోదం ఉందా? అంటూ ఆయన పవన్ ని ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి (AP CM) కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జనసైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు? అంటూ హరిరామ జోగయ్య లేఖలో పవన్ ని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి కూడా రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారు. 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం కలిగేదెప్పుడు? అని ప్రశ్నించారు. '' మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకొక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఎదురు చూస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటూ అడిగారు.
నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మీ నుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులందరకీ అర్థమయ్యేలే చెప్పాల్సిందిగా కోరుతున్నాం అంటూ ఆయన పవన్ కి లేఖ రాశారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి, విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గుడివాడ శేషుబాబు, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో అతికారి దినేష్, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకర్గంలో పోలిశెట్టి చంద్రశేఖర్ రావు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీవీ రామారావు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అలహరి సుధాకర్ లను పోటీలో నిలబెట్టేందుకు జనసేన ముందు నుంచి ఆలోచనలో ఉంది.
Also read: ఆ భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే 10 వేల డాలర్లు..అమెరికా ఎఫ్‌బీఐ!
Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...
ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది..Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Mark’s Health Update : పవన్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే...?
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి
అబ్బాయిదేమో ఆంధ్రప్రదేశ్, అమ్మాయిదేమో అమెరికా. Categories : Short News | Latest News In Telugu | వైరల్
ఏపీకి గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్
Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్
పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్లోనే ఉండనున్నాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
USA: చైనా అయిపోయింది ఇప్పుడు ఈయూ వంతు..
భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి