Mahanandi : మహానందిలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు AP: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత టెన్షన్ కలవరపెడుతోంది. మహానంది ఆలయ వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యేక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులను అలర్ట్ చేశారు అధికారులు. By V.J Reddy 30 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Mahanandi Cheetah : ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత టెన్షన్ కలవరపెడుతోంది. మహానంది ఆలయ (Mahanandi Temple) వెనుక భాగంలో మరోసారి చిరుత ప్రత్యేక్షమైంది. గత 5 రోజులుగా ఆలయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు ఆలయ అధికారులు. భక్తులు గుడి వెనుకవైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు. చిరుత సంచారంతో నల్లమల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. చిరుత (Cheetah) దాడులతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. అలర్ట్‌గా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. Also Read : కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారు: సీఎం రేవంత్ రెడ్డి #kurnool-district #cheetah #mahanandi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి