Mahanandhi: మహానందిలో మరోసారి చిరుత కలకలం!

నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు.

New Update
Mahanandhi: మహానందిలో మరోసారి చిరుత కలకలం!

Leopard in Mahanandi: మహానంది క్షేత్ర పరిసరాల్లో చిరుతపులి మరోసారి సంచారం గ్రామస్తులను, సందర్శకులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది. నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. మహానంది క్షేత్ర పరిసరాల్లో, గ్రామ శివార్లలో గత రెండు నెలలుగా చిరుత సంచారిస్తుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

20 రోజుల క్రితం బహిర్భూమికి వెళ్లిన గిరిజన యువకుడిపై చిరుత దాడి చేసి గాయపరిచింది. 15 రోజుల క్రితం కృష్ణనంది సమీపాన పొలాల్లో చిరుత సంచరించినా అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం అదే ప్రాంతంలో మళ్లీ చిరుత కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు కేకలు వేయడం, టపాసులు పేల్చడంతో చిరుత అడవిలోకి పారిపోయింది.

ఈ విషయాలన్నీ అటవీ శాఖ అధికారులకు చెబితే గ్రామ శివార్లలో, గుడి వెనుక భాగాన చెత్త వేయడం వల్ల పందులు, కుక్కలు గుంపులుగా ఉంటున్నాయని, వాటి కోసం చిరుత వస్తోందని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. ప్రాణహాని జరిగితేగానీ చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోరా? అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read: చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT vs KKR: చెండాడేసిన గుజరాత్.. కెకెఆర్ ముందు 199 టార్గెట్ - ఎవరి స్కోర్ ఎంతంటే?

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో కెకెఆర్ ముందు 199 టార్గెట్ ఉంది. 

New Update
GT vs KKR gill match

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో కెకెఆర్ ముందు 199 టార్గెట్ ఉంది. 

Advertisment
Advertisment
Advertisment