Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం..! శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. చిరుత ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో కంట్రోల్ రూమ్‌లోని అలారం మోగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుతతోపాటు రెండు పిల్లల్లు ఉన్నట్లు సమాచారం. By Jyoshna Sappogula 28 Apr 2024 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. ఈ రోజు వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ప్రహరీ వద్ద చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. చిరుతతోపాటు రెండు పిల్లల్లు ఉన్నట్లు సమాచారం. చిరుత ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో కంట్రోల్ రూమ్‌లోని అలారం మోగినట్లు తెలుస్తోంది. Also Read: అందుకే జగన్ అసమర్థ ముఖ్యమంత్రి: గన్ని వీరాంజనేయులు వెంటనే భద్రతా అధికారులు అప్రమత్తమైయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అటవీ సిబ్బంది చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. #shamshabad-airport మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి