ChatGPT: చాట్‌జీపీటీ సృష్టికర్తపై వేటు.. కంపెనీ సీఈఓగా తొలగింపు.. కారణం ఇదే.. ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్తల్లో ఒకరైన 'శామ్ అల్ట్‌మాన్'ను.. ఆ కంపెనీ బోర్డు సభ్యులు సీఈఓ పదవి నుంచి తొలగించారు. సరైన సమాచారం పంచుకోవడం లేదనే కారణంతోనే బోర్డు సభ్యులు ఆయన్ని తొలగించినట్లు ఓపెన్‌ఏఐ కంపెనీ తెలిపింది. By B Aravind 18 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి గత ఏడాది ఓపెన్‌ఏఐ సంస్థ చాట్‌జీపీటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది లాంచ్ అయిన కొద్దిరోజులకే సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది చాట్‌జీపీటీ యూజర్లుగా మారిపోయారు. ఇది భవిష్యత్తులో గూగుల్‌ను బీట్ చేస్తుందంటూ అప్పట్లో వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రసుతం ఈ ఓపెన్‌ఏఐ కంపెనీలో ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ కంపెనీ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్తల్లో ఒకరైన 'శామ్ అల్ట్‌మాన్'ను తొలగించేశారు. ఓపెన్‌ఏఐ బోర్టు సభ్యులైన.. చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుట్కేవర్, కోరా సీఈఓ డీ అంజెలో సహా తదితరులు.. శామ్ అల్ట్‌మాన్‌ను సీఈఓ నుంచి తప్పించారు. అయితే శామ్ అల్డ్‌మాన్ బోర్టు సభ్యులతో నిజాయతీ పాటించడం లేదని, సరైన సమాచారం పంచుకోవడం లేదని.. ఈ కంపెనీని నడిపే సామార్థ్యం అతనికి లేదని బోర్టు సభ్యులు నిర్ణయించారని అందుకే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించారని ఓపెన్‌ఏఐ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఓపెన్‌ఏఐ తనను సీఈఓ పదవి నుంచి తొలగించడంపై శామ్ అల్ట్‌మాన్ ఎక్స్(ట్విట్టర్) లో స్పందించారు. 'ఓపెన్‌ఏఐ కంపెనీలో పనిచేసిన సమయాన్ని ఇష్టపడ్డానని.. ప్రతిభావంతులైన వ్యక్తుల మధ్య ఇష్టంతో పనిచేశానని శామ్ అన్నారు. ఇదిలా ఉండగా.. 2015లో ఓ నాన్‌ప్రాఫిట్ రీసెర్చ్ లాబోరేటరీగా ఓపెన్‌ఏఐ సంస్థ ప్రారంభమైంది. ఈ కంపెనీని అభివృద్ధి చేసేందుకు శామ్ అల్ట్‌మాన్ తనవంతు కృషి చేశారు. ఆ తర్వాత 2020లో ఆ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. గత ఏడాది చాట్‌జీపీటీ లాంచ్ అయినప్పుడు ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోయింది. మరోవైపు శామ్ ఆల్ట్‌మాన్‌ను సీఈఓ నుంచి తొలగించాక.. ఈ కంపెనీ కో ఫౌండర్ అయిన గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా ఆ కంపెనీకి రాజీనామా చేశారు. Also Read: ఎక్స్‌లో ఎలాన్ మస్క్ కామెంట్ ఎఫెక్ట్.. దెబ్బకు ఆగిపోయిన యాడ్స్.. ఎనిమిదేళ్ల క్రితం నా అపార్ట్‌మెంట్‌లో కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి అందరం కలిసికట్టుగా పనిచేసి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించామని.. ఇది గర్వించదగ్గ విషయమంటూ ట్వీట్ చేశారు. ఈ రోజు వచ్చిన వార్తలు నన్ను ఎంతో కలచివేశాయని అందుకే తాను కూడా రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. మానవాళికి ప్రయోజనాలను అందించే సురక్షతమైన AGIని సృష్టించే లక్ష్యాన్ని తాను నమ్ముతూనే ఉంటానని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. After learning today’s news, this is the message I sent to the OpenAI team: https://t.co/NMnG16yFmm pic.twitter.com/8x39P0ejOM — Greg Brockman (@gdb) November 18, 2023 #openai #chatgpt #ai-chatgpt #openai-ceo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి