Telangana: తెలంగాణ ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పు! తెలంగాణలో హైస్కూల్ సమయాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు హైస్కూల్ టైమింగ్స్ ఉదయం 9.30 నుంచి 4.45 వరకు జరిగేవి. ఇక నుంచి ఆ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు మార్చుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. By Bhavana 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో పనివేళల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.15 వరకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పాఠశాలలపని వేళల్లో సోమవారం నుంచి మార్పులు చేర్పులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. తెలంగాణలో బోనాలు, ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు.. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు విద్యాశాక అధికారులు వివరించారు. జంట నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రస్తుతం అమలు చేస్తున్న స్కూల్ టైమ్స్ కొనసాగుతాయని అధికారులు వివరించారు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాట్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో.. గోవా, కర్నాటక, కేరళలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలో కుండపోత వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం, శనివారం స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్టు డీఈవో ఓ ప్రకటనలో తెలిపారు. Also read: గుడిసెను ఢీకొట్టిన ట్రక్కు..నిండు గర్భిణీతో పాటు కుటుంబం మొత్తం..! #hyderabad #schools #change #timings మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి