Chandrayaan-3 Success Meet : అప్పుడు కన్నీళ్లతో...ఇప్పుడు ఆనందభాష్పాలతో...!!

ఆగస్టు 23న, చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగం ఉపరితలంపై విజయవంతంగా దిగింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ అవతరించింది. 7 సెప్టెంబర్ 2019 చంద్రయాన్ -2 విఫలమవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి ఇస్రో ఛైర్మన్ కె. శివన్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్బంలో ప్రధాని మోదీ ఆయన్ను కౌగిలించుకుని ఓదార్చిన క్షణం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. మీరు కన్న కలలు త్వరలోనే సాకారం అవుతాయని ప్రధాని మోదీ ఓదార్చిన తీరు యావత్  ప్రజలను కంటతడి పెట్టించింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.  అప్పుడు కన్నీళ్లతో...ఇప్పుడు ఆనందభాష్పాలతో ఇస్రోలోకి అడుగుపెట్టారు మోదీ.

New Update
Chandrayaan-3 Success Meet : అప్పుడు కన్నీళ్లతో...ఇప్పుడు ఆనందభాష్పాలతో...!!

Chandrayaan-3 success meet : ఆగస్టు 23, 2023 గురువారం రోజున చంద్రుని దక్షిణం వైపున అడుగుపెట్టి భారతదేశం చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో అలా చేసిన మొదటి దేశం భారత్. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ కూడా తమ పనిని ప్రారంభించాయి. ఇప్పటివరకు జాబిల్లికి సంబంధించిన ఎన్నో చిత్రాలను పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండ్ అయిన సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ (Modi BRICS)సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. దీంతో పాటు త్వరలో ముఖాముఖిగా అభినందిస్తానని తెలిపారు. ఈరోజు ప్రధాని మోదీ విదేశాల నుంచి తిరిగి వచ్చి నేరుగా బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌కు చేరుకుని శాస్త్రవేత్తలను అభినందించారు.

Read Also : ఇస్రోలో ప్రధాని మోదీ… బృందాన్ని అభినందించిన ప్రధాని..!!

బెంగుళూరు విమానాశ్రయం నుండి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాని(Satish Dhawan Space Centre)కి ప్రధాని చేరుకోగానే అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు ఆయనకు ఉత్సాహంతో స్వాగతం పలికారు. ఇది చూసిన జనాలకు 2019 సంవత్సరం గుర్తుకొచ్చింది. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి మిషన్ చంద్రయాన్-2 (Chandrayaan-2) విఫలమైంది. ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో ప్రధాని మోదీ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోనే ఉన్నారు. ఉదయం అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. అప్పటి ఇస్రో చీఫ్ కె.శివన్‌ను కలిశారు. దీంతో ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కె శివన్‌ను కౌగిలించుకుని ఓదార్చారు. ఇది చూసి ప్రధాని మోదీతో పాటు యావత్ దేశం కళ్లలో నీళ్లు తిరిగాయి.

కానీ నేడు వాతావరణం మొత్తం మారిపోయింది. అప్పటి కన్నీళ్లు నేడు.. ఆనందభాష్పాలుగా మారాయి. కె.శివన్ (K.Sivan) కన్నీళ్లు పెట్టిన సమయంలో ప్రధాని మోదీ ఆయన్ను ఓదార్చడం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. మన కలలు సాకారం అవుతాయి..వాటిని త్వరలోనే నెరవేర్చుతాం. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుదాం. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ప్రధాని మోదీ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిఒక్కరికి గుర్తుకు వస్తున్నాయి. కలలు కన్నట్లుగానే..అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించారు.

Read Also : ఈ కారును ఒక్కసారి ఛార్జీ చేస్తే చాలు తిరుపతి వెళ్లొచ్చు..!!

ఈరోజు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కి ప్రధాని మోదీ చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు చాలా సంతోషంగా కనిపించారు. ఈరోజు కూడా ప్రధాని మోదీ పలువురు శాస్త్రవేత్తలను కౌగిలించుకుని అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలందరి ముఖాల్లో విజయం సాధించిన ఆనందం కనిపించింది. ఈ రోజు అక్కడ ఉన్న చాలా మంది శాస్త్రవేత్తలు 7 సెప్టెంబర్ 2019 ఉన్నారు. కె శివన్ ను గుర్తు చేసుకున్నారు. అతని కన్నీళ్లను ఆనందభాష్పాలుగా మార్చుకున్నారు. ఈరోజు ఆయన ప్రధాని మోదీని సగర్వంగా కలిశారు. చంద్రుని ఉపరితలంపై భారత జెండాను ఎగురవేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు