AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై చంద్రబాబు సీరియస్..! మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Chandrababu: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం అత్యవసర విచారణ చేపట్టింది. కీలక ఫైల్స్ అగ్నిప్రమాదంలో దగ్గం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందే ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనను అంత్యంత సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. అగ్నిప్రమాదమా, కుట్ర పూరితమా అనే అంశంలో విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు.. వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్ లో వెళ్లాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీ, సిఐడీ చీఫ్ కొద్ది సేపట్లో మదనపల్లి బయలుదేరనున్నారు. Also Read: అసలు నీ భర్త ఎవరు?: శాంతికి సర్కార్ నోటీసులు #ap-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి