CBN Yagam: దోష నివారణ కోసం చంద్రబాబు రాజశ్యామల యాగం! చంద్రబాబు దంపతులు మరోసారి రాజశ్యామల యాగం చేస్తుండడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నివాసంలో మూడు రోజులపాటు రాజశ్యామల యాగం చేస్తున్నారు. రాజశ్యామల యాగంలో చంద్రబాబు,భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. By Trinath 16 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి రాజకీయ నాయకులు యాగం చేయడం సాధారణ విషయంగా మారిపోయింది. సీఎం పదవి కోసం చేస్తారో.. అధికారం కోసం చేస్తారో తెలియదు కానీ యాగం మాత్రం చేసేస్తారు. కేసీఆర్ గతంలో అనేకసార్లు చేశారు.. గత ఎన్నికలకు ముందు కూడా చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అటు రేవంత్‌రెడ్డి కూడా చేశారు. ఆయన గెలిచారు. ఇటు ఏపీలోనూ చంద్రబాబు ఇటివలీ యాగాలు చేస్తున్నారు. గతనెలలోనే చండీ యాగం చేసిన చంద్రబాబు ఈసారి రాజశ్యామల యాగం చేస్తున్నారు. నిజానికి గతంలోనూ చంద్రబాబు ఈ యాగం చేశారు. చంద్రబాబు దంపతులు మరోసారి రాజశ్యామల యాగం చేస్తుండడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నివాసంలో మూడు రోజులపాటు రాజశ్యామల యాగం చేస్తున్నారు. రాజశ్యామల యాగంలో చంద్రబాబు,భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ఉదయం 9 నుంచి 12:00 వరకు, తిరిగి సాయంత్రం 6:00 నుంచి 9:00 వరకుఈ యాగం కొనసాగుతుంది. వ్యక్తిగత దోష నివారణ కోసం రాజ్యశ్యామల యాగం చేస్తున్నట్లు టీడీసీ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో చండీయాగం చేశారు చంద్రబాబు. రాజ శ్యామలా యాగం ప్రయోజనాలు: ఇది ఏవైనా ప్రభుత్వ సంబంధిత సమస్యలు లేదా అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి కుటుంబాన్ని కష్టాలు, డబ్బు సంబంధిత బాధల నుంచి ఆశీర్వదిస్తుంది. రక్షిస్తుంది. తద్వారా జీవితంలో అధిక అదృష్టాన్ని ఇస్తుంది. ఇది ఒక వ్యక్తికి జ్ఞానంలో ప్రావీణ్యం పొందడానికి సహాయపడుతుంది. దేవత రాజా శామల , భగవంతుడు బ్రహ్మ, సరస్వతీ దేవికి ఉన్న ఏకైక కుమార్తె. నారద మహర్షి చెల్లెలు. ఆమె ఫేట్ రైటర్, సృష్టికర్త అయిన బ్రహ్మకు సహాయం చేస్తుంది. రాజా శామల దేవత వాక్కు, సంగీతం, జ్ఞానం, కళలను నియంత్రిస్తుంది. అతీంద్రియ శక్తులను పొందడం, ముఖ్యంగా శత్రువులపై నియంత్రణ సాధించడం, ప్రజలను తనవైపు ఆకర్షించడం, కళలపై పట్టు సాధించడం, అత్యున్నత జ్ఞానాన్ని పొందడం కోసం ఆమె ఆరాధన నిర్దేశించబడింది. Also Read: మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు! #chandrababu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి