చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పచ్చి ఫేక్.. సజ్జల హాట్ కామెంట్స్

చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఫేక్ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద మరింతకాలం ఉండడానికి వీలుగా వైద్యులు మెడికల్ రిపోర్టు ఇచ్చినట్టుందని అన్నారు.

New Update
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు సిగ్గు రాలేదు.. సజ్జల హాట్ కామెంట్స్

AP Politics: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) మధ్యంతర బెయిల్ పై వైసీపీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద మరింతకాలం ఉండడానికి వీలుగా వైద్యులు మెడికల్ రిపోర్టు ఇచ్చినట్టుందని ఆరోపించారు. చర్మ వ్యాధులను ప్రాణాంతక వ్యాధులన్నట్టు మెసేజ్ వచ్చేలా డాక్టర్లు రిపోర్టులు ఇచ్చారని అన్నారు. AIG ఆసుపత్రి రిపోర్టు చూస్తే వైద్యులా, పొలిటికల్ డాక్టర్లా అన్నట్టు కనిపిస్తుందని విమర్శించారు.

ALSO READ: సీఎం కేసీఆర్ చరిత్ర సరిగ్గా చదవలేదు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు

కోర్టు వైద్యం చేయించుకోమని బెయిల్ ఇస్తే.. అంబులెన్స్ తో బయట తిరగమని డాక్టర్లే చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉండాలని తాము కోరుకోవట్లేదని తెలిపారు. చంద్రబాబు జైలు లోపల ఉంటే తమకు వచ్చే లాభం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బయటకి వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. చంద్రబాబు చేసిన స్కాం ఈ వంకలతో పక్కకి పోతోందని పేర్కొన్నారు. చంద్రబాబు పొలిటికల్ అవసరానికి సూడో మెడికల్ వ్యవహారం చేస్తున్నట్లు అందరూ గమనించాలని సజ్జల కోరారు.

మేనిఫెస్టో కోసం రెండు దేశాల అగ్రనాయకుల లాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చంద్రబాబు కూర్చున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో ప్రజల చెవుల్లో క్యాలిఫ్లవర్ పెడుతున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ల బరితెగింపును ప్రజలు గమనించాలని అన్నారు. సీఎం జగన్ ప్రజల నుంచి తెచ్చుకున్న అజెండా అమలు ఫలితాలే అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఈ విషయం సామాజిక సాధికారత యాత్ర స్పందన తోనే తెలుస్తుందని పేర్కొన్నారు.

ALSO READ: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!

తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని.. అలాగే ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఓపెన్ గా టీడీపీ తమతో ఉందని చెబుతున్నారని అన్నారు. ఒకేసారి ఎంతమందితో సంసారం చేస్తారని బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలపై చురకలు అంటించారు. ఏపీ బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి (Purandeswari).. చంద్రబాబు అజెండా మాట్లాడుతుందని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కి ఉన్నది ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయగలమనే బరితెగింపు మాత్రమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు