ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు విన్యాసాలు

చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 1978 కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు.. అనంతరం ఆయన భార్యతో కలిసి ఎన్టీఆర్‌ను కలిశారని, ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకొని తనను తెలుగు దేశం పార్టీలోకి తీసుకోవాలని కోరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరకు టీడీపీ వ్యవస్థాపకుడికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

New Update
ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు విన్యాసాలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన పేరుతో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. 1947 నుంచి 2019 వరకు ఏపీలో కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీలే అధికారంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 1978లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పాటు మంత్రిగా పనిచేశారన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తన భార్యతో పాటు ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడి తెలుగుదేశం పార్టీలో చేరాడని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1978 నుండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలకంగా ఉండేవారని వెల్లడించారు.

40 సంవత్సరాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో ఉండి ఏదో ఒక పదవిని అనుభవించి అధికారంలో ఉన్న చంద్రబాబు ఆనాడు ఈ ప్రాజెక్టులను ఎందుకు కట్టలేకపోయారని నాని ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన పులిచింతల ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేకపోయారన్నారు. తన సొంత జిల్లా అయిన చిత్తూరులో గాలేరు, నగరి కాలువలను ఎందుకు పునరుద్దరించలేదన్న ఎమ్మెల్యే.. చంద్రబాబు ప్రాజెక్టుల గురించి ఇప్పుడెందుకు శ్రద్ధ పెట్టారన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెబితే చంద్రబాబు రాత్రిపూట భయపడుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. 70 సంవత్సరాల వయసున్న పెద్దిరెడ్డి నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారన్నారు. చిత్తూరులో పెద్దిరెడ్డికి ఉన్న ప్రజాధారణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. కుప్పంలో కూడా ఏదో చేస్తారనే భయంతో చంద్రబాబు పెద్దిరెడ్డిని బ్రతిమిలాడుకుంటున్నారన్నారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించి రాష్ట్రం నుంచి తరిమికొట్టేంతవరకు పెద్దిరెడ్డి నిద్రపోరని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలన్న నానీ.. 2024 అనంతరం చంద్రబాబుకు రాజకీయ చరమగీతం పాడేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అన్నారు. వారాహీ యాత్ర చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తమకు అభ్యంతరం లేదన్న ఆయన.. తాను పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు అనేకసార్లు ప్రయత్నించానని కానీ తనకు పవన్‌ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఆత్మీయులంతా పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేసేవారని, చంద్రబాబు ఆత్మీయులంతా ఏదో లబ్ధి పొందుదామని చంద్రబాబు నాయుడు వెనుక ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు పదవిలో లేకపోవడంతో వాళ్లంతా చతికిల పడ్డారని కొడాలి నాని పేర్కొన్నారు.

2024 ఎన్నికల అనంతరం కనీసం ప్రతిపక్ష నాయకుడ్ని కూడా కాలేనని గమనించిన చంద్రబాబు.. అందుకే పవన్ కళ్యాణ్‌ను కలుపుకుంటే కనీసం అధికారంలోకి రాకున్నా.. ప్రతిపక్ష హోదా అయినా వస్తుందనే ఆశతో ఉన్నారన్నారు. దీనిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గమనించాలని కొడాలి నాని సూచించారు. అవసరానికి వాడుకొని వదిలేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడం అతని రక్తంలోనే ఉందని నాని విమర్శించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు