Nara Lokesh: నారా లోకేష్‌కు చంద్రబాబు కీలక పదవి! AP: చంద్రబాబు కేబినెట్లో నారా లోకేష్ ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కేబినెట్‌తో పాటు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు యోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. అయితే. లోకేష్‌కు ఏ శాఖలు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 07 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కు మంత్రి పదవీ వచ్చే అవకాశం ఉంది. తన కేబినెట్ లో కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తునట్లు తెలుస్తోంది. నారా లోకేష్‌కి కీలక శాఖలు అప్పగించే ఛాన్స్ ఉంది. 2017 నుంచి 2019 వరకు పంచాయతీరాజ్, ఐటీ పరిశ్రమల శాఖలు నిర్వహించారు లోకేష్. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూనే మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు కేబినెట్లోకి లోకేష్‌ను తీసుకుంటారా , లేదా? అని మూడు రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారంటూ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర టీడీపీకి మంచి మైలేజ్ తెచ్చింది. అలాగే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నపుడు లోకేష్ కేంద్ర పెద్దలను కలిసి.. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు లోకేష్ పార్టీలో కీలక బాధ్యతలతో పాటు కేబినెట్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. మరి లోకేష్ ఏ పదవి దక్కుతుందో వేచి చూడాలి. #lokesh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి