Anantapur: 3 నెలల్లో సైకో ప్రభుత్వం పోతుంది.. భువనేశ్వరి స్పందిస్తున్న తీరు చూస్తే..!!

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. ఎలాంటి తప్పు చేయకుండానే కేవలం సీఎం జగన్ మెప్పు పొందేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనియం అని అన్నారు. తమ నేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్.

New Update
Anantapur: 3 నెలల్లో సైకో ప్రభుత్వం పోతుంది.. భువనేశ్వరి స్పందిస్తున్న తీరు చూస్తే..!!

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. ఎలాంటి తప్పు చేయకుండానే కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మెప్పు పొందేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనియం అని అన్నారు. తమ నేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్.

లోకేష్ ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం

రెండవ రోజుకు చేరుకున్న కాలువ శ్రీనివాసులు ఆమరణ దీక్ష నేపథ్యంలో పోలీసులు వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. మరో మూడు నెలల్లో ఈ సైకో ప్రభుత్వం దిగిపోయి తమ ప్రజా ప్రభుత్వం వస్తుందని అంతేకాకుండా అసెంబ్లీలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఒకవైపు అయితే.. స్పీకర్ ఏకంగా వైసీపీ నాయకులను ఉద్దేశించి మనవాళ్లంతా పక్కకు రండి అని మాట్లాడడం చాలా జిగురు సహకారంగా ఉందన్నారు. నేను కూడా మంత్రిగా ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశానని స్పీకర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా అసెంబ్లీలో వ్యవహరించాలన్నారు. తమ్మినేని సీతారాం వైసీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్దారు. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా లోకేష్ ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు.

ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో నీకు అర్థమవుతుందా..!!

తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేస్తే న్యాయ సలహాల కోసం ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. అలాగే జాతీయ మీడియాతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు విధానాలను.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన విధానాన్ని వారితో పంచుకుంటున్నారు. చాలామంది అగ్ర నాయకులను, మేధావులను కలిసి నారా లోకేష్ కూడా పరిణతి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నాయకుల ఆగడాలను ఎండగడుతుంటే ఓర్వలేక నారా లోకేష్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. చంద్రబాబునే కాదు.. నారా లోకేషన్ కూడా అరెస్టు చేసినా.. టీడీపీ నాయకులను అరెస్టు చేసినా.. ఎవరు భయపడరు. అన్నిటికీ ప్రతి ఒక్కరు సిద్ధమయ్యారని మరి ముఖ్యంగా నారా భువనేశ్వరి స్పందిస్తున్న తీరు చూస్తే.. నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థమవుతుందన్నారు.

బుద్ధి చెప్పే సమయం దగ్గర్లోనే ఉంది

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసే పనులు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. జగన్ తో పాటు మంత్రివర్గ సభ్యులకు అందరికీ బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గర్లోనే ఉందంటూ ఫైరయ్యారు కాలువ శ్రీనివాస్. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన తమ నేత చంద్రబాబును అక్రమంగా జైల్లో బంధించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. టీడీపీ సీనియర్ నాయకుడు, పాలక్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు