Chandrababu: ఇది కొత్త చరిత్రకు శ్రీకారం అంటున్న చంద్రబాబు.. విజయం మనదే అంటున్న పురందేశ్వరి 

ఏపీ ఎన్నికల పోలింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొన్న ఓటర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి X వేదికగా ధన్యవాదములు తెలిపారు. ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. ఆ ట్వీట్స్ లో వారు ఏమన్నారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే. 

New Update
Chandrababu: ఇది కొత్త చరిత్రకు శ్రీకారం అంటున్న చంద్రబాబు.. విజయం మనదే అంటున్న పురందేశ్వరి 

Chandrababu: ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఓటర్లలో చైతన్యం స్పష్టంగా కనిపించింది. ఎన్నడూ లేని విధంగా ఓటు వేయడానికి ఉత్సాహంగా ప్రజలు తరలి వచ్చారు. భారీ పోలింగ్ మధ్య ఎవరికి ఓటర్లు పట్టం కట్టారో తెలియాలంటే జూన్ 4 వరకూ ఆగాల్సిందే. అయితే, ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటర్లు పోలింగ్ లో పాల్గోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు Xలో చేసిన ఒక పోస్ట్ లో పోలింగ్ లో పాల్గొన్న ప్రతి ఓటరుకు ధన్యవాదములు తెలిపారు. ఇది కొత్త చరిత్రకు శ్రీకారం అంటూ పేర్కొన్నారు. ఇక పురంధేశ్వరి కూడా X వేదికగా ఓటర్లకు కృతఙ్ఞతలు తెలిపారు. విజయం మనదే అంటూ ట్వీట్ చేశారు. 

చంద్రబాబు నాయుడు తన ట్వీట్ లో ఏమన్నారంటే.. 

Chandrababu: “రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించింది. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరు లోనూ స్పష్టంగా కనిపించింది. ఒకే రకమైన సంకల్పంతో ఓటు వేయడానికి వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ప్రజలు. ఆర్థిక భారాన్ని, ఎండ వేడిమిని, ప్రయాణ కష్టాన్ని ఓర్చుకుని రాష్ట్రం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

 ఓటమి భయంతో భయోత్పాతం సృష్టించి పోలింగ్ ను తగ్గించడానికి వైసీపీ నేతలు హింసకు పాల్పడినా ఎక్కడా వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూస్తే 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది శుభసూచకం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా కలిసివచ్చిన మూడు పార్టీలను అర్థం చేసుకుని ఆదరించిన మీకు ధన్యవాదాలు. రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులే. ఏపీ ప్రజల స్ఫూర్తికి మరోమారు ధన్యవాదాలు... అభినందనలు”

చంద్రబాబు నాయుడు ట్వీట్ ఇదే.. 

Also Read: మెగాఫ్యామిలీలో అల్లు అర్జున్ రచ్చ.. నాగబాబు ట్వీట్ సంచలనం.. 

పురంధేశ్వరి తన ట్వీట్ లో ఏమి చంపారంటే.. 

“కౌరవులకు-గౌరవులకు మధ్య జరిగిన ఈ కురుక్షేత్ర మహా సంగ్రామంలో ధర్మం పక్షాన నిలచి కూటమికి ఓటు వేసిన మీ అందరికీ నా కృతజ్ఞతా పూర్వక అభినందనలు...

రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం, జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

జయం మనదే...

విజయం మనదే...

ఘన విజయం మనందరిదీ..!”

పురంధేశ్వరి ట్వీట్ ఇదే.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు