Chandrababu Mulakat: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒంటరిగానే చంద్రబాబు.. కలవని కుటుంబసభ్యులు!

ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ రద్దు అయ్యింది. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును కలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరగగా.. కుటుంబసభ్యులు రాలేదు. అడ్వకేట్లకు తప్ప ఇతరులకు ములాఖత్ ఉండదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సెంట్రల్ జైలు చుట్టూ భద్రతను పటిష్టం చేశారు పోలీసులు. చంద్రబాబు నాయుడు కోసం మందులు, ఆహారం తీసుకువెళ్లేందుకు అనుమతించిన కొద్దిమంది తప్ప ఇతరులెవరినీ ప్రవేశ ద్వారాల దగ్గరికి అనుమతించలేదు.

New Update
Chandrababu Mulakat: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒంటరిగానే చంద్రబాబు.. కలవని కుటుంబసభ్యులు!

Chandrababu Mulakat Cancelled: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌(skill development scam)లో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులు చంద్రబాబును కలవనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ములాఖత్‌(mulakat)కు అధికారులు అనుమతి కూడా ఇచ్చారు. అయినా కుటుంబసభ్యులు కలవలేదు. ములాఖత్‌లో చంద్రబాబును భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలుస్తారని టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేశారు. అయితే మధ్యాహ్నం దాటినా జైలుకు రాలేదు కుటుంబ సభ్యులు. ములాఖత్‌ రద్దయినట్లు అధికారులు ప్రకటించారు.

బ్లాక్‌ కాఫీ, వేడినీళ్లు:
విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. అరెస్టు వరకు జరిగిన నాటకీయ పరిణామాలు, పోలీసుల చర్యలతో చంద్రబాబు 48 గంటల పాటు నిద్రపోలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రాత్రి రాజమండ్రి జైలుకు చేరుకున్న చంద్రబాబు తెల్లవారుజామున 4 గంటల వరకు మేల్కొని ఉన్నారని సమాచారం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చంద్రబాబు కోసం జైలు ఆవరణలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. చంద్రబాబుకు సహాయంగా ఐదుగురు భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత సహాయకుడిని నియమించారు. సోమవారం ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయనకు బ్లాక్‌ కాఫీ, వేడినీళ్లు, ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్‌ సలాడ్‌ను డెలివరీ చేసి, ఇంటి నుంచే భోజనం చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది.

అంతేకాకుండా, ప్రతిరోజూ ముగ్గురు వ్యక్తులతో సమావేశానికి (ములాఖత్) చంద్రబాబును అనుమతించింది కోర్టు. తన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును కలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరగగా.. కుటుంబసభ్యులు రాలేదు. మధ్యాహ్నం ఒంటి గంటకు AP 9G 393 నెంబరు వాహనంలో కుటుంబీకులు లంచ్ పంపారు. టీడీపీ అధ్యక్షుడికి వారానికి రెండుసార్లు ములాఖత్ అవకాశాలు ఉన్నప్పటికీ, ఆయన బెయిల్, కస్టడీ పిటిషన్‌లు ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో కనీసం మొదటి వారంలో అయినా న్యాయవాదులను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌.. ఇతర కుటుంబ సభ్యులు ఇవాళ(సెప్టెంబర్ 11) చంద్రబాబు నాయుడును కలుస్తారని అంతా భావించగా.. అడ్వకేట్లకు తప్ప ఇతరులకు ములాఖత్ ఉండదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సెంట్రల్ జైలు చుట్టూ భద్రతను పటిష్టం చేశారు పోలీసులు. చంద్రబాబు నాయుడు కోసం మందులు, ఆహారం తీసుకువెళ్లేందుకు అనుమతించిన కొద్దిమంది తప్ప ఇతరులెవరినీ ప్రవేశ ద్వారాల దగ్గరికి అనుమతించలేదు.

ALSO READ: చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్

Advertisment
Advertisment
తాజా కథనాలు