Jharkhand: ప్రభుత్వ ఏర్పాటుకు చంపై సోరెన్ సై..గవర్నర్ కలవనున్న జేఎంఎం ఎమ్మెల్యేలు..!!

జార్ఖండ్‌లో హేమంత్ సోరాన్ అరెస్ట్ తర్వాత చంపై సోరెన్ సీఎం అయ్యే అవకాశం ఇప్పుడు బలంగా మారింది. చంపై సోరెన్‌తో సహా ఐదుగురు జేఎంఎం ఎమ్మెల్యేలను గవర్నర్ సమావేశానికి పిలిచారు.సాయంత్రం 5.30 గంటలకు చంపై సోరెన్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు.

New Update
Jharkhand: ప్రభుత్వ ఏర్పాటుకు చంపై సోరెన్ సై..గవర్నర్ కలవనున్న జేఎంఎం ఎమ్మెల్యేలు..!!

జార్ఖండ్‌లో చంపై సోరెన్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు చంపై సోరెన్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ ముక్తి మోర్చా లెజిస్లేటివ్ పార్టీ నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు.

రాజ్ భవన్ కు వెళ్లనున్న ఐదుగురు ఎమ్మెల్యేలతో కూడిన ప్రతినిధి బృందం:
చంపై సోరెన్‌తో సహా ఐదుగురితో కూడిన ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌కు వెళ్లనుంది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్‌కు చెందిన ఆలం గిర్ ఆలం, ఎంఎల్‌కు చెందిన వినోద్ సింగ్, కాంగ్రెస్‌కు చెందిన ప్రదీవ్ యాదవ్, ఆర్‌జెడికి చెందిన సత్యానంద్ గుప్తా ఉన్నారు. గవర్నర్‌ కోరితే కూటమి ఎమ్మెల్యేలందరినీ రాజ్‌భవన్‌కు తీసుకెళ్తామని కూటమి నేతలు చెబుతున్నారు.రాజ్‌భవన్‌ నుంచి అపాయింట్‌మెంట్ లభించిన తర్వాత జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళ పరిస్థితి ఇప్పుడు స్పష్టమవుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం అర్థరాత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత మాత్రమే జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేశారు. అయితే చంపై సోరెన్ లేఖను పరిశీలిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. మరోవైపు, అధికార కూటమికి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి నుంచి రాంచీలోని సర్క్యూట్ హౌస్‌లో బస చేశారు. ఈ ఎమ్మెల్యేలను ఎక్కడికో తరలించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా సోరెన్ కుటుంబంలోనే ఇంటిపోరు:
హేమంత్ సోరెన్ అరెస్ట్‌ అయితే తరువాతి ముఖ్యమంత్రి ఆయన భార్య కల్పానా సోరెన్ సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆమెను సీఎం చేసేందుకు తాను వ్యతిరేకమని జేఎంఎపం నేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ అడ్డుపుల్ల వేసినట్లు తెలుస్తోంది. అసలు ఎమ్మెల్యే కాని వాళ్ళని సీఎం ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలుండగా కల్పనా పేరేందుకు ప్రచారం చేస్తున్నాంటూ ప్రశ్నించారు. కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్‌ను... 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. కల్పనాను ముఖ్యమంత్రి చేయాడానికి వీలులేదు అంటూ నిరసనకు దిగారు. దీంతో చంపై సోరెన్నను సీఎంగా ఎన్నుకొన్నారు. చంపై సోరెన్‌ ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు.

అరెస్ట్‌కు ముందు:
ఇక హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయడానికి ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అతనిని నివాసానికి చేరుకుని 7 గంటలకుపైగా ప్రశ్నించింది. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా హేమంత్ సమాధానాలివ్వలేదని తెలిసింది. ఆతరువాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందు హేమంత్‌ను ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. గవర్నర్ కూడా వెంటనే రాజీనామాను ఆమోదించారు.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు