AP CEO: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై CEO కీలక వ్యాఖ్యలు.. అలా ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ పై ఏపీ CEO ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు. టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

New Update
AP CEO: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై CEO కీలక వ్యాఖ్యలు.. అలా ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

AP CEO On Ustad Bhagat Singh Movie: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. రిసెంట్ గా విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. ముఖ్యంగా “గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది .. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం” అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. అంతేకాదు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కూడా జనసైనికులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ పై తాజాగా ఏపీ CEO ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక వ్యాఖ్యలు చేశారు. టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

Also Read: పవన్ కళ్యాణ్ తో పోటీలో ఉండేది ఇందుకే.. ఆర్టీవీతో వంగా గీత సంచలన వ్యాఖ్యలు..!

ఉద్యోగులకు వార్నింగ్

ఈ క్రమంలోనే పలు విషయాలను ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల (Election Rules) ఉల్లంఘన అంశాలను సి - విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రభుత్వ స్థలాల్లో 1.99 లక్షల హోర్డింగులు, ప్రైవేట్ స్థలాల్లో 1.15 లక్షల హోర్డింగులు తీసేశామని వెల్లడించారు. గత మూడు రోజులుగా 3.39 కోట్ల విలువైన మద్యం, నగదు అక్రమ రవాణను అరికట్టామని.. వాటిని సీజ్ చేశామని తెలిపారు. నిన్నటి వరకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. స్వయంగా ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Also Read: అసదుద్దీన్ ఓవైసీ పెద్ద దొంగ.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ఆ జిల్లా ఎస్పీ లు వివరణ ఇవ్వాలి..

ఈ క్రమంలోనే ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో జరిగిన రాజకీయ హింసపై జిల్లాల ఎస్పీ లను వివరణ కోరామన్నారు. ఆళ్లగడ్డ, గిద్దలూరులో హత్యలు జరిగాయని..మాచర్లలో కారు తగుల బెట్టిన విషయాలను గుర్తు చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ జిల్లాల ఎస్పీలు ఈసీ కార్యాలయంలో సీఈవో వద్ద హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. హత్యలు, హింస ఎలా జరిగింది? ఎవరి పాత్ర ఉందనే దానిపై వివరణ తీసుకుంటామన్నారు. ఇలాంటి హింసకు ఇప్పుడే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు