TS New Governor: తెలంగాణకు కొత్త గవర్నర్.. రేవంత్ సర్కార్ పై కేంద్రం కొత్త వ్యూహం ఇదే?

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ ను ఎదుర్కోవడమే లక్ష్యంగా కొత్త గవర్నర్ ను నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళిసై కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారాం. ఈ మేరకు కేంద్ర పెద్దల అపాయిట్మెంట్ ను కోరినట్లు తెలుస్తోంది.

New Update
TS New Governor: తెలంగాణకు కొత్త గవర్నర్.. రేవంత్ సర్కార్ పై కేంద్రం కొత్త వ్యూహం ఇదే?

తెలంగాణకు కొత్త గవర్నర్ నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకోన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్ సర్కార్ ను (CM Revanth Reddy Government) ఎదుర్కొనేందుకు రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని తెలంగాణ గవర్నర్ గా (Telangana Governer) నియమించాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. తమిళిసైని ప్రస్తుతానికి పాండిచ్చేరికి బదిలీ చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. మా యాక్షన్ ప్లాన్ ఇదే: కిషన్ రెడ్డి

అయితే.. ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ యాక్టీవ్ కావాలని తమిళిసై భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తూతుకుడి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని తమిళిసై భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయమై హైకమాండ్ పెద్దలతో తమిళిసై మాట్లాడుతున్నట్లు కూడా రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే.. బీజేపీ హైకమాండ్ ఇందుకు ఓకే చెబితే ఆమె పోటీకి దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం కాదంటే పాండిచ్చేరి గవర్నర్ గా ఆమె కొనసాగే అవకాశం ఉంది. ఈ విషయాలు చర్చించేందుకు తమిళిసై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు