Kishan Reddy: వరద ప్రభావిత ప్రాంతల్లో కిషన్ రెడ్డి, భట్టి పర్యటన

TG: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే నిధులు విడుదల చేస్తామన్నారు.

New Update
Kishan Reddy: వరద ప్రభావిత ప్రాంతల్లో కిషన్ రెడ్డి, భట్టి పర్యటన

Kishan Reddy: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగులేటి. అనంతరం మీడియాతో మాట్లాడారు కిషన్ రెడ్డి. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు అందిస్తామని అన్నారు. వరద సాయం విషయంలో కేంద్రానికి వివక్ష లేదని స్పష్టం చేశారు. స్టేట్ డిజాస్టర్‌ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలని అన్నారు. మరోసారి తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉంది..

ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆహారం, తాగునీరు, వైద్యసాయంపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఖర్చుకు వెనకాడమని భరోసా ఇచ్చారు. మధిర నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లోని పంట పొలాల్లో పర్యటించి జరిగిన ఆస్తి నష్టాన్ని చూసి రైతన్నల అవేదనలను విని వారికి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్తూ తెగిన కుంటలను, చెరువులను పరిశీలుస్తూ, ప్రజలందరినీ జాగ్రత్తగా కాపాడేవిధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు