ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...ఇక పోల’వరం’ కానుంది..!

పోలవరం విషయంలో ఏపీ పంటపండింది.రాష్ట్ర ప్రభుత్వం మొర కేంద్ర ప్రభుత్వం చెవికి చేరింది. పదేపదే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.ప్రాజెక్ట్‌ లో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని ఇన్నాళ్లూ మొండికేసిన కేంద్ర ప్రభుత్వం..ఇప్పుడు శుభవార్త చెప్పింది.రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.ఇప్పుడు తాగునీటి విభాగం కోసం చేసే ఖర్చును కూడా తామే భరిస్తామని జలశక్తి మంత్రి శ్రీ బిశ్వేశ్వర్‌ తుడు జవాబిచ్చారు.

New Update
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...ఇక పోల’వరం’ కానుంది..!

పోలవరం విషయంలో ఏపీ పంటపండింది.రాష్ట్ర ప్రభుత్వం మొర కేంద్ర ప్రభుత్వం చెవికి చేరింది. పదేపదే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

publive-image
ప్రాజెక్ట్‌ లో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని ఇన్నాళ్లూ మొండికేసిన కేంద్ర ప్రభుత్వం..ఇప్పుడు శుభవార్త చెప్పింది.రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.

ఇప్పుడు తాగునీటి విభాగం కోసం చేసే ఖర్చును కూడా తామే భరిస్తామని పేర్కొంది.ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి 55వేల 548 కోట్ల రూపాయల నిధుల గురించి విజయసాయి రెడ్డి ప్రశ్నించగా.. జలశక్తి మంత్రి శ్రీ బిశ్వేశ్వర్‌ తుడు జవాబిచ్చారు.

మిగిలిన పనులు పూర్తి చేయడానికి 10వేల 911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్‌ నిర్మాణం మరమ్మతుల కోసం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆర్థికశాఖ ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని మంత్రి స్పష్టం చేశారు.

అయితే, కాంపోనెంట్‌వారీగా నిధుల చెల్లింపు వల్ల ప్రాజెక్ట్‌ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని.. చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం జగన్‌ తన ఢిల్లీ పర్యటనల్లోనూ పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు.

కాంపోనెంట్‌ వారీ చెల్లింపులపై సీలింగ్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయవిభాగం గత జూన్‌ 5న తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు.. రాజ్యసభలో మంత్రి బిశ్వేశ్వర్‌ వెల్లడించారు.

కాగా.. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీకి మేలు జరగనుంది. దీని కారణంగా కేంద్రం నుంచి మరిన్ని నిధులు రానున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలనే నిధులు విడుదల చేసిన కేంద్రం.. తాజాగా.. ఈ నిర్ణయం తీసుకోవడం ఏపీకి కలిసివచ్చే అంశంగా పేర్కొంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆ హామీకి గ్రీన్ సిగ్నల్!

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అమరావతి నుంచి హైదరాబాద్‌కు రూ.25 వేల కోట్లతో చేపట్టే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

New Update
Prime Minister Modi visit AP on January 8th

Modi government good news to AP

AP News: NDA కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీపై మోదీ సర్కార్‌ వరాల జల్లు కురిపిస్తోంది. ఓ వైపు పోలవరం.. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తుంది. ఇంకొవైపు రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం దిశగా అడుగులెస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్రం ప్రభుత్వం.  

5 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్..

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర విభజన వేళ నుంచి పరిష్కారం కాని సమస్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అమరావతి నుంచి హైదరాబాద్‌కు  గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం డీపీఆర్‌ సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించింది. మొత్తం 6 లైన్లలో దాదాపు 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఏం మనిషివిరా.. దారుణం.. అక్కనే చంపిన తమ్ముడు

అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే వస్తే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ హైవేను అమరావతి నుంచి హైదరాబాద్‌కు ఏ రూట్‌లో ప్లాన్ చేశారన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం అమరావతి నుంచి హైదరాబాద్‌కు రెండు రూట్‌లు ఉన్నాయి. విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు ఒక రూట్.. పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్‌కు మరో రూట్ ఉంది.  ఇందులో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ఏ రూట్‌ నుంచి వస్తుందనేది స్పష్టం కాలేదు.

ఇది కూడా చదవండి: పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే

మరోవైపు ఇప్పటికే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం భూ సేకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందుకోసం కేంద్రం నిధులనూ మంజూరు చేసింది. ఇదే సమయంలో - ఏపీలో మరో రిఫైనరీని ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఆదేశించింది కేంద్రం. అలాగే అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్‌లు రూపొందించాలని సూచించింది.

 modi | chandrababu | today telugu news

Advertisment
Advertisment
Advertisment