Election Commission: ఏపీ అసెంబ్లీ గడువు జూన్ 16

దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంటు, వివిధ రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో విధుల్లో ఉండే ఉద్యోగులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

New Update
Election Commission: ఏపీ అసెంబ్లీ గడువు జూన్ 16

Election Commission: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంటు, వివిధ రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో విధుల్లో ఉండే ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలు, ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు తీసుకోవాల్సిన చర్యలపై ఈసీ కీలక సూచనలు చేయడంతో పాటు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: దద్దరిల్లిన తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశం.. చలికాలంలో చెమటలు పట్టించిన చర్చ..!

చాలా కాలంగా బదిలీ కాకుండా ఒకే జిల్లాలో కొనసాగుతున్న, కనీసం మూడేళ్లుగా కొనసాగుతున్న అధికారులను వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. సొంత జిల్లాలో పోస్టింగులు ఉన్న వారికి కూడా అదే నిబంధన అమలు చేయాలని సూచించింది.

ఎన్నికల విధులతో సంబంధం లేని ఉద్యోగులను, విభాగాలను వాటికి దూరంగా ఉంచాలని పేర్కొన్నది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకున్న అధికారులు, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. అలాంటి అధికారులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారంతో రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: India Corona Cases: దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా..

లోకసభ సార్వత్రిక ఎన్నికలతో పాటు 2024లో ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్వరలోనే ఆయా ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు